ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పేలిన పవర్ బ్యాంక్.. మహిళ అరెస్ట్

https://static.asianetnews.com/images/authors/26af83d2-0ed6-5e66-b49b-5078caf01292.jpg
First Published 30, Aug 2018, 12:58 PM IST
power bank blast in Delhi Airport
Highlights

ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పవర్ బ్యాంక్ పేలడంతో నిన్న కలకలం రేగింది. ఢిల్లీలోని ఢిఫెన్స్ కాలనీకి చెందిన మాళవిక తివారీ అనే మహిళ నిన్న ఉదయం స్పైస్‌జెట్ విమానంలో ధర్మశాలకు వెళ్లాల్సి ఉంది

ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పవర్ బ్యాంక్ పేలడంతో నిన్న కలకలం రేగింది. ఢిల్లీలోని ఢిఫెన్స్ కాలనీకి చెందిన మాళవిక తివారీ అనే మహిళ నిన్న ఉదయం స్పైస్‌జెట్ విమానంలో ధర్మశాలకు వెళ్లాల్సి ఉంది. అయితే చెకింగ్ సమయంలో భద్రతా సిబ్బంది ఆమె బ్యాగును పరిశీలించారు. ఈ క్రమంలో ఏదో ఒక వస్తువు అనుమానాస్పదంగా కనిపించడంతో దానిని బయటకు తీశారు.

తీరా చూస్తే అది పవర్ బ్యాంకు.. భద్రతా కారణాల రీత్యా ఇలాంటి వస్తువులకు అనుమతి లేదని సిబ్బంది అభ్యంతరం తెలపడంతో ఆమె వారితో వాగ్వివాదానికి దిగింది. ఈ సమయంలో సహనం కోల్పోయిన మాళవిక పవర్ బ్యాంక్ తీసి గోడకు విసిరికొట్టింది.. దీంతో అది ఒక్కసారిగా పేలిపోయింది.

ఈ సంఘటనతో ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళ వాతావరణం నెలకొని, ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. విమానాశ్రయ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించిన నేరంపై మాళవికను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 

TODAY'S POLL

బిత్తిరి సత్తి శ్రీ ముఖిపై అతిగా కామెంట్ చేశాడా?

loader