తమిళనాడులో దెయ్యం వదిలిస్తానంటూ మహిళలను కొరడాతో కొట్టి హింసిస్తున్న పౌడర్ స్వామిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. మూఢనమ్మకంతో తన దగ్గరికి వచ్చే వారికి కర్రలతో, కొరడాలతో కొడుతూ, కాళ్లతో తంతూ హింసిస్తున్న ఈ స్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కొరడాతో కొడితే దయ్యం వదులుతుందని, కర్రలతో బాదితే పారిపోతుందని.. చెంపల మీద ఎడా పెడా వాయించి, వీపు మీద పిడిగుద్దులు కురిపిస్తే.. చేసిన పాపాలు పోతాయని జనాలను నమ్మించడంతో ఇతని దగ్గరికి తండోపతండాలుగా జనం వస్తుంటారు.
ఇక తాను ఎంత హింసిస్తున్నా నోట్లోంచి ఒక్క ముక్క బైటికి రానివ్వద్దని ఆదేశిస్తాడు. మొహం బాధగా పెట్టకుండా తాను కొడితే, కొట్టించుకోవాలి.. తంతే తన్నించుకోవాలి. అదే ఈ స్వామి స్పెషాలిటీ..
నామక్కల్ జిల్లా కాదపల్లికి చెందిన అనిల్ కుమార్ (42) మంజనాయకనూరు కరుప్పన్నస్వామి ఆలయాన్ని తన వికృత చేష్టలు అడ్డాగా మార్చుకున్నాడు.
దెయ్యం పట్టిందనే మూఢనమ్మకంతో తన దగ్గరికి వచ్చిన మహిళలను కొరడాతో దారుణంగా కొట్టేవాడు. అతను ముఖానికి పౌడర్ పూసుకోవడంతో పౌడర్ స్వామిగా పేరు పొందాడు.
మహిళలను హింసిస్తున్న దృశ్యాలను కొందరు సెల్ ఫోన్ లో చిత్రీకరించి వాట్సాప్ లో పెట్టడంతో వైరల్ గా మారాయి. దీనిమీద స్పందించిన ఎస్పీ శక్తి గణేశన్ ఆదేశాల మేరకు వేలగౌండం పోలీసులు అనిల్ కుమార్ ను అరెస్ట్ చేశారు.