ఢిల్లీ ఎన్నికల కౌంటింగ్ మావోదలయింది. పోస్టల్ బ్యాలట్ కౌంటింగ్ సాగుతుంది. పోస్టల్ బ్యాలట్ ఓట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి అధికంగా వచ్చాయి. దాదాపు 70 నియోజకవర్గాల్లో దాదాపుగా 53 నియోజకవర్గాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుంది. 

పోస్టల్ బ్యాలట్ మాత్రమే గెలుపును నిర్దేశించలేవనేది నిజం. కానీ ఈ పోస్టల్ బ్యాలట్ లలో మాత్రం ఒక నిగూఢ సమాచారం దాగి ఉంది. దాదాపుగా పోస్టల్ బ్యాలట్ లను వినియోగించుకునేవారిలో మెజారిటీ ప్రజలు సైన్యానికి చెందినవారు. 

సాధారణంగా ఈ సైనికుల ఓట్లు కలిగి ఉండే పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ అత్యధికంగా లాభపడేది. కాకపోతే అందుకు భిన్నంగా ఇక్కడ ఢిల్లీలో మాత్రం బీజేపీకి కాకుండా పోస్టల్ బ్యాలట్ లు ఆమ్ ఆద్మీపార్టీకి అనుకూలంగా వచ్చాయి. 

Also read: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2020: దూసుకుపోతున్న ఆప్

హర్యానాలో దీపిండెర్ సింగ్ హూడా నియోజకవర్గంలో అతని ఓటమికి కారణం ఈ పోస్టల్ బ్యాలట్లే. ఈవీఎం యంత్రాలపైన ఓట్లలో కాంగ్రెస్ కె అధికంగా పోల్ అయ్యాయి. పోస్టల్ బ్యాలెట్లు అధికంగా బీజేపీకి రావడంతో అతను ఓడిపోయాడు. 

కాబట్టి ఈ పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు మాత్రమే విజేతను నిర్ణయించలేవని చెప్పినప్పటికీ తక్కువ మెజార్టీలతో విజేత నిర్ణయింపబడేచోట అవి ఖచ్చితంగా ప్రభావం చూపెడుతాయని చెప్పక తప్పదు. 

ఇక ఢిల్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా కేజ్రీవాల్ మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం తథ్యం అని తేల్చి చెప్పాయి. ఇండియా టుడే- ఆక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ మొదలు రిపబ్లిక్ జన్ కి బాత్ సర్వే వరకు అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే విషయాన్నీ స్పష్టం చేసాయి. 

70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో మేజిక్ మార్కు 36. ఆమ్ ఆద్మీ పార్టీ తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవడం తథ్యం అని అందరూ చెబుతున్నప్పటికీ.... సీట్ల విషయంలో మాత్రమే తేడా కనబడుతుంది. న్యూస్ ఎక్స్ వంటి సంస్థలు ఆప్ 57 సీట్ల వరకు గెలవొచ్చు అని చెబుతుంటే... న్యూస్ 18 వంటి సంస్థలు 45 సీట్లకే ఆప్ పరిమితం అవ్వొచ్చని అంటున్నారు.