తమిళనాడు తిరుచ్చిలోని శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయంలోని గోపురం పాక్షికంగా దెబ్బతింది. గోపురంలోని చిన్న భాగం శనివారం తెల్లవారుజామున కుప్పకూలింది.
తమిళనాడు తిరుచ్చిలోని శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయంలోని గోపురం పాక్షికంగా దెబ్బతింది. గోపురంలోని చిన్న భాగం శనివారం తెల్లవారుజామున కుప్పకూలింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని ఆలయ అధికారులు తెలిపారు. వివరాలు.. రంగనాథస్వామి ఆలయాన్ని నిర్వహించే హిందూ మత, ధర్మాదాయ శాఖ నిర్మాణాన్ని పునరుద్ధరించడానికి రూ. 98 లక్షల రూపాయలు మంజూరు చేయగా.. తాత్కాలిక పునరుద్ధరణ పనులు ఇప్పటికే జరుగుతున్నాయి. అయితే దామోదర కృష్ణంకోయిల్ గోపురం రెండో అంచెపై చిన్నపాటి శిల్పాలతో కూడిన రాతి ముఖమండపంలో కొంత భాగం, ఆలయ తూర్పు ద్వారంలోని గోపురాలలో కొంత భాగం కూలిపోయి నేలపై పడింది.
ఈ సంఘటన తెల్లవారుజామున 2 గంటల సమయంలో జరిగినందని అధికార వర్గాలు చెబుతున్నాయి. 108 వైష్ణవ 108 దివ్య దేశాలలో శ్రీరంగం ఒకటి. ఈ ఘటన అనంతరం అక్కడి శిథిలాల తొలగింపు ప్రక్రియను చేపట్టారు. కూలిన రాళ్లు, ప్లాస్టర్‌లను సిబ్బంది తొలగించడం ప్రారంభించారు. అదే సమయంలో భక్తులెవరూ ఆ దారిలో వెళ్లవద్దని ఆలయ నిర్వాహకులు కోరుతున్నారు. ఇక, తిరుచ్చిలో దాదాపు అరగంటకు పైగా భారీ వర్షం కురిసింది.

ఇదిలాఉంటే, శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయం దాదాపు 156 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఆలయ ప్రాంతంలో మొత్తం 21 గోపురాలు ఉన్నాయి.
