ప్రముఖ రేడియో ప్రెజెంటర్, 'గీతమాల' అమీన్ సయానీ కన్నుమూత..

ఐకానిక్ రేడియో హోస్ట్ అమీన్ సయానీ 91 ఏళ్ల వయసులో మరణించారని ఆయన కుటుంబ సభ్యులు బుధవారం తెలిపారు. గుండె సంబంధిత వ్యాధితో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

Popular radio presenter, 'Gitamala' Amin Sayani passes away - bsb

ముంబై : ఐకానిక్ రేడియో హోస్ట్ అమీన్ సయానీ గుండెపోటుతో 91 ఏళ్ల వయసులో మరణించారని ఆయన కుమారుడు రాజిల్ సయానీ బుధవారం తెలిపారు. హార్ట్ ఎటాక్ రావడంతో తన తండ్రిని ముంబైలోని హెచ్‌ఎన్ రిలయన్స్ ఆసుపత్రికి తరలించామని, కానీ కాపాడుకోలేకపోయామని రాజిల్ సయానీ తెలిపారు. గురువారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

డిసెంబర్ 21, 1932న ముంబైలో జన్మించిన అమీన్ సయానీ తన మధురమైన గాత్రం, ఆకర్షణీయమైన శైలితో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తరాలు మారినా ఆయన అభిమానులు పెరుగుతూనే వచ్చారు.  అమీన్ ఆంగ్ల భాషా ప్రసారకర్తగా వృత్తిని ప్రారంభించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత హిందీకి మారారు.

హర్యానా-పంజాబ్ సరిహద్దులో మళ్లీ ఉద్రిక్తత.. రైతులపై బాష్పవాయువు ప్రయోగం

సయానీ తన రేడియో ప్రోగ్రామ్ 'గీత్మాల' ద్వారా విపరీతమైన ప్రజాదరణ పొందారు. రేడియో శ్రోతలు పెరగడంలో ఈ ప్రోగ్రాం కీలక పాత్ర పోషించింది. అద్బుతమైన హిందీ పాటలను రూపొందే ఈ గీతమాల దశాబ్దాలు గడిచినా ఆకట్టుకుంటూనే ఉంటుంది. ఈ కార్యక్రమానికి భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా విపరీతమైన అభిమానులున్నాయి. శ్రోతలను "బెహ్నో ఔర్ భాయియో" అని సంబోధించే తీరు సిగ్నేచర్ స్టైల్ గా మారింది. ఆ తరువాత ఎంతోమంది దీన్ని ఫాలో అయ్యారు. 

సయాని కెరీర్ ఆరు దశాబ్దాలుగా 54,000 రేడియో కార్యక్రమాలు, ప్రకటనలు, జింగిల్స్ కోసం 19,000 వాయిస్ ఓవర్‌లను చేశారు. సయాని కేవలం రేడియో వ్యాఖ్యాతగానే కాకుండా నటుడిగా కూడా ఆకట్టుకున్నారు. చిన్న పాత్రలలో వివిధ చిత్రాలలో కనిపించారు. తరచుగా తన నిజ జీవిత పాత్ర అయిన అనౌన్సర్‌గా కనిపించేవారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios