ఖమ్మం బీఎస్ఆర్ లో కలకలం చేలారేగింది. ఖమ్మం జిల్లాలో గత కొన్ని రోజులుగా పార్టీలోనే ఉంటూ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్న పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిని పార్టీ అధిష్టానం సస్పెండ్‌ చేసింది. ఈ క్రమంలో  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో  పొలిటికల్ వార్ స్టార్ అయ్యింది. 

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడేక్కాయి. ఖమ్మం బీఎస్ఆర్ లో కలకలం చేలారేగింది. గత కొన్ని రోజులుగా పార్టీపై విమర్శలు గుప్పిస్తోన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిని బీఆర్ఎస్ అధిష్టానం సస్పెండ్‌ చేసింది. దీంతో మాజీ ఎంపీ పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. సీఎం కేసీఆర్ కు బహిరంగ సవాల్ విసిరారు. గత ఎన్నికలలో ఖమ్మం జిల్లాలో కేవలం ఒక్క సీటు మాత్రమే బీఆర్ఎస్.. ఈసారి ఆ స్థానాన్ని కూడా గెలిచే అవకాశం లేదని తేల్చి చెప్పారు. రానున్న ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి ఖమ్మం జిల్లాలో ఒక్క సీటు కూడా రాకుండా చేస్తానని, ఖమ్మం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిని ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటును తాకనివ్వనని పొంగులేటి సవాల్ చేశారు. ఈ సవాల్ తో ప్రస్తుతం ఖమ్మం రాజకీయ రసవత్తరంగా మారాయి.

ఈ క్రమంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. తాను పార్టీ సభ్యుడిని కానప్పుడు తనను సస్పెండ్ ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు . కేసీఆర్ తనని సస్పెండ్ చేయడం హాస్యాస్పదమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై తాను జనవరి నుంచే విమర్శిస్తున్నానని, కానీ నేడు సస్పెండ్ చేశారని అన్నారు. తను వైసీపీలో ఉన్నప్పుడు పార్టీలోకి రావాలని సీఎం కేసీఆర్ .. తనపై ఎంతో ఒత్తిడి చేశారని, కేటీఆర్ కూడా ఎన్నోసార్లు మాట్లాడి కెసిఆర్ వద్దకు తీసుకువెళ్లారని గుర్తు చేశారు.

ఈ క్రమంలో పొంగులేటి అనుచరులు బీఆర్‌ఎస్‌ పార్టీకి ఊహించని విధంగా షాక్ ఇచ్చారు. తమ నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయడంతో.. బీఆర్‌ఎస్ పార్టీకి 300 మంది రాజీనామా 
. ఈ సంచలన నిర్ణయం తీసుకున్న వారిలో మాజీ ఎంపీటీసీలు,సర్పంచ్ లు, సోసైటి డైరెక్టర్లు ఉన్నారు. ఈ క్రమంలో పొంగులేటి అనుచరులు బీఆర్ఎస్ అధిష్టానంపై విమర్శలు గుప్పిస్తున్నారు. 8 యేండ్లు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కేసీఆర్‌ వాడుకొని వదిలేశారని మండిపడుతున్నారు. ఇప్పటి వరకు డైలామాలో ఉన్నామని, ఇప్పటి నుండి పొంగులేటి కార్యచరణ తమ కార్యచరణ అని స్పష్టం చేశారు. 

తాము పొంగులేటి శ్రీనివాసరెడ్డిని గెలిపించుకోవటానికి సైనికుల్లా పనిచేస్తామని అంటున్నారు. పొంగులేటి తో పాటు జూపల్లి కృష్ణారావును సైతం బీఆర్‌ఎస్‌ అదిష్టానం పార్టీ నుంచి తొలగించింది. దీంతో ఒకేసారి ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు కీలక నేతలను సస్పెండ్‌ చేయడంతో జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. అయితే.. పొంగులేటి, జూపల్లిలు ఏ పార్టీ తీర్థం పుచ్చుకుంటారు. ఏ పార్టీ కండువా కప్పుకుంటారో అనేది సర్వత్రా చర్చనీయంగా మారింది.