Asianet News TeluguAsianet News Telugu

ఆఫ్తాబ్ పాలిగ్రాఫ్ పరీక్షల్లో విస్తుపోయే వాస్తవాలు.. నేడూ కొనసాగనున్న టెస్టులు..

శ్రద్ధావాకర్ హత్య కేసులో నిందితుడు ఆఫ్తాబ్ కు పాలిగ్రాప్ టెస్ట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడిని అనేక ప్రశ్నలు అడిగారు. విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 

polygraph test to Aaftab, Relationship with Shraddha, details of murder was asked during the period
Author
First Published Nov 25, 2022, 2:12 PM IST

ఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో.. పోలీసులు తాజాగా నిందితుడికి పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించారు. ఈ టెస్టులో పోలీసులు ఆఫ్తాబ్ నుంచి కీలక విషయాలు రాబట్టారు. ఈ పరీక్షల కోసం ఢిల్లీలోని రోహిణిలో ఉన్న ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీని వినియోగించారు. నిన్న ఉదయం 12 గంటల సమయంలో ఈ పాలిగ్రాఫ్ పరీక్ష మొదలుపెట్టారు. ఈ క్రమంలో పోలీసులు ఆప్థాబ్ ను హిందీలో ప్రశ్నలు అడిగారు. ఈ ప్రశ్నలకు ఆఫ్తాబ్ ఇంగ్లీషులో సమాధానాలు చెప్పాడని సమాచారం. 

ఈ క్రమంలో పోలీసులు శ్రద్ధాతో ఆప్థాబ్ కు ఉన్న సంబంధం,  ఆమె హత్యకు ఎలాంటి పరిస్థితులు దారితీశాయి. నేరం ఎప్పుడు, ఎలా జరిగింది. శ్రద్ధా శరీర భాగాలను ఆప్థాబ్ ఎక్కడెక్కడ పడేశాడు.. అనే.. అనేక అంశాలకు సంబంధించిన వివరాలను అడిగారు. ఈ రోజు కూడా ఆప్థాబ్ కు పాలిగ్రాఫ్ టెస్టులు నిర్వహించనున్నారు. సుమారు ఎనిమిది గంటల పాటు ఈ పరీక్షలు జరగనున్నాయి. మరోవైపు సూరజ్ కుండ్ అడవుల్లో నిన్న సూట్కేసులో కొన్ని మానవ శరీరభాగాలు దొరికాయి. వీటిని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. ఈ భాగాలను డీఎన్ఏ పరీక్షలకు పంపనున్నారు.

దారుణం.. మూగ, చెవిటి దళిత యువతిపై సామూహిక అత్యాచారం..

ఆఫ్తాబ్ ఇంటిని తనిఖీ చేసిన పోలీసులు.. అక్కడినుంచి దాదాపు ఆరు అంగుళాల పొడవు ఉన్న ఐదు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. పరీక్షలకోసం వీటిని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరెటరీకి పంపించారు. దీంతోపాటు 3 సీసీ కెమెరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిల్లో  ఆఫ్తాబ్ చంద్రాపూర్ ప్రాంతంలో తిరుగుతున్న దృశ్యాలు నమోదయ్యాయి. వందల గంటల కొద్దీ ఈ వీడియో రికార్డులు ఉన్నాయి. వీటిని విశ్లేషించే బాధ్యతను ఓ బృందానికి అప్పగించారు. నేరం జరిగిన, అనుమానిత ప్రాంతాలకు సంబంధించి దాదాపు 150కి పైగా సీసీ కెమెరాలను విశ్లేషించిన తర్వాత ఆఫ్తాబ్ కదలికలను గుర్తించామని పోలీసులు తెలిపారు.

శ్రద్ధకు నరకం చూపించేవాడు...
ఆఫ్తాబ్-శ్రద్ధాలు కొంతకాలం బాగానే ఉన్నారు. కానీ ఆ తరువాతే అతనిలోని మృగం నిద్రలేచింది. కలిసి ఉన్న సమయంలో అతను హిసించిన విషయానికి సంబంధించి పలు కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. వారు కలిసి ఉన్న రోజుల్లో ఆఫ్తాబ్ ఆమె వీపుపై సిగరెట్టుతో కాల్చేవాడు.  ఈ విషయాన్ని శ్రద్ధా మిత్రులు పోలీసులకు తెలిపారు. అయితే, ఆఫ్తాబ్ ను పిచ్చిగా ప్రేమించిన శ్రద్ధా.. అతడితోనే  కలిసి ఉండాలని భావించి.. అతడిని భరించినట్టు చెప్పుకొచ్చారు.

పక్కా ప్లానింగ్ తో ఆధారాలు లేకుండా…
శ్రద్ధా వాకర్ హత్యలో తాను దొరికిపోకుండా ఉండాలని ఆఫ్తాబ్ పక్కా ప్లానింగ్ వేశాడు. దీనికి సంబంధించిన విషయాలను ఢిల్లీ పోలీసు అధికారులు పేర్కొన్నారు. 12 రోజుల ఆఫ్తాబ్ విచారణతో తమకు ఈ విషయం స్పష్టంగా తెలిసిందని పోలీసులు తెలిపారు. తాను బయటపడకుండా ఉండడం కోసం శ్రద్ధా శరీర భాగాలను పడేసే సమయంలో చాలా తెలివిగా వ్యవహరించాడు. ఆ టైంలో ఎలక్ట్రానిక్ ఆధారాలు దొరికి.. భవిష్యత్తులో పోలీసులకు చిక్కకుండా ఉండాలని చాలా ముందు జాగ్రత్తలు తీసుకున్నాడని వెల్లడించారు.  ఆ సమయంలో తన వెంట ఫోన్ ను తీసుకు వెళ్ళకపోయేవాడు. ఫోన్ ను ఇంట్లోనే ఉంచేవాడు అన్నారు. ఎందుకంటే భవిష్యత్తులో ఎప్పుడైనా పోలీసులు వాటిని పరిశీలించినా సిగ్నల్స్ లొకేషన్ ఇంట్లోనే చూపించేలా తగు జాగ్రత్తలు తీసుకున్నాడని తెలిపారు.

ముందుగా ప్లాన్ ప్రకారమే అద్దెకు దిగి…
ఢిల్లీలోని ఛత్రపూర్ ప్రాంతంలో కూడా ఆఫ్తాబ్ ముందుగానే ప్లాన్ ప్రకారమే ఇల్లు తీసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆఫ్తాబ్ కు హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నప్పుడు భద్రి అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అతడి సహాయంతోనే ఆఫ్తాబ్  ఛత్రపూర్ ప్రాంతానికి వచ్చాడని తెలుస్తోంది. ఛత్రపూర్ ప్రాంతానికి సమీపంలోనే అడవులు ఉన్నాయి. ఇది గ్రహించిన తరువాతే ఆఫ్తాబ్ ఛత్రాపూర్ లో ఇళ్ళు తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు. అయితే, ఇంత ప్లాన్ చేసినా.. న్యాయస్థానం ఎదుట మాత్రం క్షణికావేశంలో ఆ ఘటన జరిగినట్లు  ఆఫ్తాబ్ చెప్పాడు. ఈ నేపథ్యంలోనే రెండేళ్ల క్రితం శ్రద్ధా ఆప్తాబ్ పై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు వెలుగు చూసింది. ఈ ఫిర్యాదులో  ఆప్తాబ్ తనను ఎప్పటికైనా ముక్కలుగా నరికి చంపుతాడని పేర్కొంది. చివరికి శ్రద్ధా చెప్పినట్టే ఆఫ్తాబ్ ఆమెను హత్య చేశాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios