Assembly election 2022: దేశంలో త్వ‌ర‌లోనే ఐదు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఆయా రాష్ట్రాల్లో అధికారం ద‌క్కించుకోవాల‌ని బీజేపీ వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతోంది. ఈ నేప‌థ్యంలోనే ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని ప్ర‌ధాని మోడీ వ‌ర్చువ‌ల్ మాట్లాడుతూ.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో మార్పును తీసుకురావ‌డానికి బీజేపీ ప్ర‌య‌త్నిస్తుంటే.. ప్ర‌తిప‌క్ష పార్టీలు ప్ర‌తీకార కాంక్ష‌తో ముందుకు సాగుతున్నాయ‌ని ఆరోపించారు. యూపీలో బీజేపీకి స‌వాలు విసురుతున్న స‌మాజ్ వాదీ అధినేత అఖిలేష్ యాద‌వ్ ను టార్గెట్ చేస్తూ ప్ర‌ధాని మోడీ తీవ్ర విమర్శలు గుప్పించారు.  

Assembly election 2022: దేశంలో త్వ‌ర‌లోనే ఐదు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఆయా రాష్ట్రాల్లో అధికారం ద‌క్కించుకోవాల‌ని బీజేపీ వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతోంది. ఈ నేప‌థ్యంలోనే ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని ప్ర‌ధాని మోడీ వ‌ర్చువ‌ల్ మాట్లాడుతూ.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో మార్పును తీసుకురావ‌డానికి బీజేపీ ప్ర‌య‌త్నిస్తుంటే.. ప్ర‌తిప‌క్ష పార్టీలు ప్ర‌తీకార కాంక్ష‌తో ముందుకు సాగుతున్నాయ‌ని ఆరోపించారు. యూపీలో బీజేపీకి స‌వాలు విసురుతున్న స‌మాజ్ వాదీ అధినేత అఖిలేష్ యాద‌వ్ (Akhilesh Yadav) ను టార్గెట్ చేస్తూ ప్ర‌ధాని మోడీ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. 

ఉత్తరప్రదేశ్‌లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని, ప్రతిపక్షాలు ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) ఆరోపించారు. యూపీలో బీజేపీపై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ ఓటర్లను ప్రేరేపిస్తోందనీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ అభివృద్ధి విధానాలకు ప్రతిక్షాలు విరుద్ధంగా ముందుకు సాగుతున్నాయని అన్నారు. "నక్లి సమాజ్‌వాద్ (నకిలీ సమాజ్‌వాద్) వర్సెస్ గరీబ్ కా సర్కార్ (పేదల ప్రభుత్వం)" (Nakli Samajwad versus gareeb ka sarkaar) అని మ‌ధ్య పోరు అని పేర్కొన్న ప్ర‌ధాని మోడీ.. పేదలకు ఇళ్లు, వెనుకబడిన తరగతుల వార‌కి అభివృద్ధి ప‌థ‌కాలు, వైద్య కళాశాలలు, ఎక్స్‌ప్రెస్‌వేల ద్వారా గ్రేటర్ కనెక్టివిటీ, ముస్లిం మహిళలకు సంబంధించిన కార్యక్రమాలు, వివాహాల పెంపుదల వంటి అంశాలను ప్ర‌ధాని (Prime Minister Narendra Modi) త‌న ప్ర‌సంగంలో ప్ర‌స్తావించారు. 

అలాగే, శ్రీకృష్ణుడు ప్రతి రాత్రి తన కలలోకి వస్తాడనీ, యూపీలో ప్ర‌భుత్వం తానే ఏర్పాటు చేస్తాన‌ని చెప్పాడ‌ని అఖిలేష్ యాద‌వ్ పేర్కొన్న వ్యాఖ్య‌ల‌ను సైతం ప్ర‌ధాని మోడీ ప్ర‌స్తావిస్తూ.. ఈ రోజుల్లో ప్ర‌జ‌లు చాలా క‌ల‌లు కంటార‌నీ, నిద్ర పోయే వారు మాత్ర‌మే క‌ల‌ల ప్ర‌పంచంలో ఉంటార‌ని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నోయిడా, గ్రేటర్ నోయిడాలోని పట్టణ ప్రాంతాల్లోని గృహాల సమస్యపై కూడా ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ఆ ప్రాంతంలో ఫ్లాట్లను కొనుగోలు చేసిన వేలాది మంది ఇబ్బందులు ప‌డుతున్నార‌నీ, అయితే, అసంపూర్తిగా ఉన్న ఫ్లాట్లను పూర్తి చేసేందుకు ప్రత్యేక నిధిని అందజేస్తామని (Prime Minister Narendra Modi) హామీ ఇచ్చారు.

"మేము ఉత్తరప్రదేశ్‌లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాము. మరియు ప్రతిపక్షాలు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాయి. ఈ వ్యక్తులు అలాంటి వారికి టిక్కెట్లు ఇచ్చారు.. వారి ప్రవర్తనే రుజువు ... అల్లర్ల మనస్తత్వం ఉన్న వ్యక్తులు. నేరాగాళ్లు వారికి ఫ్రెండ్లీ గ‌వ‌ర్న‌మెంట్ రావాల‌ని కోరుకుంటున్నారు" అని ఆయన జన్ చౌపాల్ కార్యక్రమం ద్వారా షామ్లీ, ముజఫర్‌నగర్, బాగ్‌పట్, సహరాన్‌పూర్, గౌతమ్ బుద్ నగర్ ఓటర్లను ఉద్దేశించి ప్ర‌ధాని మోడీ అన్నారు. యూపీలో ఫిబ్రవరి 10న జరగనున్న తొలి దశ ఎన్నికలలో కీలకమైన పశ్చిమ యూపీలో కీల‌క ఓటింగ్ ప్రాంతం ఇది. 

"ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద భారతదేశం ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకుంటోంది. 15 కోట్ల మంది పౌరులు ఉచిత రేషన్ పొందుతున్నారు. ఇదే యూపీలో ఐదేండ్ల కింద‌ట రేష‌న్ షాపుల నుంచి పేద‌లు స‌రుకుల‌ను ఎత్తుకెళ్లే ప‌రిస్థితులు ఉన్నాయి.. కానీ నేడు ప్ర‌తి పేద ఇంటికీ ప్ర‌తి రేష‌న్ స‌రుకు అందుతోంది.. గత ఐదేళ్లలో వచ్చిన మార్పు ఇదే’’ అని మోడీ అన్నారు. స‌న్న‌కారు రైతుల గురించి కూడా తాము ఆలోచ‌న చేస్తున్నామ‌నీ, వారి ఆదుకోవ‌డానికి క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని (Prime Minister Narendra Modi) తెలిపారు.