మల్లికార్జున్ ఖర్గే 'కబ్జా' కామెంట్స్ పై రాజకీయ దుమారం...
జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ జాతీయాధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే చేసిన కబ్జా కామెంట్స్ దుమారం రేపుతున్నాయి.
జమ్మూ ఆండ్ కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఇప్పటికే జాతీయపార్టీలు బిజెపి, కాంగ్రెస్ లు అభ్యర్థులను కూడా ప్రకటిస్తున్నాయి...ప్రధాన పార్టీలన్ని ఎన్నికల ప్రచారాన్ని కూడా హోరెత్తిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షులు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
జమ్మూ కాశ్మీర్ లో విజయం దేశంలోని మిగతా ప్రాంతాలపై కూడా ప్రభావం చూపుతుందని ఖర్గే అన్నారు. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ విజయం సాధిస్తే దేశం మొత్తం కబ్జాలో వుంటుందన్నారు. ఇలా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందకు ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.
ఖర్గే వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ దేశ ఐక్యతను దెబ్బతీసేలా, భద్రతకే ముప్పు చేసేలా కామెంట్స్ చేస్తోందని ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తున్నారు. అధికారం కోసం కాంగ్రెస్ ఎంతకయినా తెగిస్తుందనేందుకు ఈ వ్యాఖ్యలే నిదర్శనమని...ఇదే కదా కాంగ్రెస్ చరిత్ర అంటూ బిజెపి నాయకులు మండిపడుతున్నారు.