Asianet News TeluguAsianet News Telugu

మోడీతో షేక్ హ్యాండ్- చంద్రబాబు "బెండ్" అయినట్లేనా..?

మోడీతో షేక్ హ్యాండ్- చంద్రబాబు "బెండ్" అయినట్లేనా..?

Political analysis on Shakehand between PM Narendramodi and AP CM Chandrababu Naidu

ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చాకా.. చాలా నీతి ఆయోగ్ సమావేశాలు జరిగాయి. కానీ వీటిలో వేటికి లేని ప్రాధాన్యత ఆదివారం జరిగిన సమావేశానికి వచ్చింది. ఇందుకు కారణం లేకపోలేదు.... తమ రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెడతామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని.. తమను కనీసం పట్టించుకోవడం లేదని సాదాసీదా నేతలకు సైతం అప్పాయింట్‌మెంట్ ఇచ్చి తనను, తన పార్టీని ప్రధాని చిన్న చూపు చూస్తున్నారని టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపిస్తూ వచ్చారు.

రాజకీయ అవసరమో.. లేదంటే ఏమైనా హార్ట్ అయ్యారో కానీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి.. అప్పటి నుంచి బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తూ వస్తున్నారు.. మోడీ అంటే ఆగ్రహాంతో ఉన్న వ్యతిరేక శక్తులన్నింటిని కూడగట్టడానికి ప్రయత్నిస్తున్నారు చంద్రబాబు.. బీజేపీ ఏపీతో పాటు దేశంలో పుట్టగతులు లేకుండా చేస్తానన్న స్థాయిలో విమర్శలు సంధించారు టీడీపీ అధినేత.. ఇక కేరళలో తమ హిందుత్వ  కార్యకర్తల ప్రాణాలను తీసేస్తున్నారని.. లవ్ జిహాదిపై చర్యలు తీసుకోవడం లేదంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై కాషాయం గుర్రుగా ఉంది..

ఇదే సమయంలో 15వ ఆర్థిక సంఘం రాష్ట్రాల హాక్కులను కాలరాస్తోందని ముందుగా గొంతు విప్పింది విజయనే....తమకు మెజార్టీ ఎమ్మెల్యేల మద్ధతు ఉన్నప్పటికీ.. గవర్నర్ ద్వారా తమను ఇబ్బందుల పాలుజేసేందుకు మోడీ ప్రయత్నించారని ఆగ్రహాం వ్యక్తం చేశారు కర్ణాటక సీఎం కుమారస్వామి.. ఇక బీజేపీ అంటేనే అంతెత్తున లేచే మమతా బెనర్జీ.. వీరంతా గత కొద్దిరోజుల నుంచి బీజేపీ వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ.. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడిగా సాగాలని నిర్ణయించిన వారు.. వీరంతా నీతీ ఆయోగ్‌లో ఎలాంటి వాణి వినిపిస్తారోనని.. దేశం ఆసక్తిగా ఎదురుచూసింది. కానీ అందరిలోకి చంద్రబాబుపైనే నేషనల్ మీడియా గురిపెట్టింది. 

తీరా ఆ రోజు రానే వచ్చింది.. ఈ సమావేశంలో ఇద్దరు ఎదురుపడితే మాట్లాడుకుంటారా.? కనీసం మొఖాలైనా చూసుకుంటారా.? అని పోల్ కూడా నడిచింది. వీటన్నింటికి తెర దించుతూ సమావేశానికి హాజరైన ప్రధాని మోడీకి చంద్రబాబు తారసపడటం ఇద్దరు పకపక నవ్వుకోవడం.. ఏపీ సీఎం ప్రధాని చెయ్యి పట్టుకోని వదలకపోవడం నేషనల్ లెవల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆ స్టిల్ బయటకు వచ్చిందో లేదో వెంటనే నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. వీరితో పాటుగా జాతీయ స్థాయిలో ప్రముఖ జర్నలిస్టులు రాజ్‌దీప్ సర్దేశాయ్, శేఖర్ గుప్తా కూడా తమదైన శైలిలో స్పందించారు.

చంద్రబాబుతో మోడీ ఉన్న ఫోటోను ట్వీట్ చేసి.. పిక్చర్ కామెంట్ ఆఫ్ ది డే అంటూ కామెంట్  చేసి ఇదీ.. వీరి రాజనీతి అంటూ వ్యంగ్యాస్త్రాన్ని సంధించారు రాజ్‌దీప్.. ఇక ఫోటోలో ఉన్న నలుగురు సెక్యులర్ ముఖ్యమంత్రుల్లో ముగ్గురు గతంలో బీజేపీతో కలిసి ప్రభుత్వంలో ఉన్నవారేనని.. వీరిలో చంద్రబాబు రెండుసార్లు బీజేపీతో పనిచేశారని శేఖర్ గుప్తా ట్వీట్ చేశారు. లోపల ఎన్నెన్ని ఉన్నా.. ప్రోటాకాల్ రీత్యా పలకరింపులు, షేక్ హ్యాండ్‌లు మాములేనని.. మనిషికన్నా పదవికి గౌరవం ఇచ్చి తీరాలని.. అంత మాత్రం చేత చంద్రబాబు.. మోడీ ముందు బెండ్ అవ్వలేదని వాదనలు వినిపిస్తున్నాయి..

ఇక ఫోటోను కనుక జాగ్రత్తగా గమనిస్తే చంద్రబాబుకు షేక్ హ్యాండ్ ఇచ్చింది కేరళ సీఎం పినరయి విజయన్ అని.. మమతా, కుమారస్వామి, విజయన్, చంద్రబాబు మాట్లాడుకుంటుండగా మోడీ అక్కడికి వచ్చారని.. ఆ సమయంలో ప్రధానిని చూసి ఏపీ  సీఎం ముసి ముసినవ్వులు నవ్వారని మరికొందరు సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. కానీ కురుక్షేత్రం యుద్ధం చేస్తానని చెప్పిన చంద్రబాబుకు ఈ ఫోటో వల్ల నాయకులంతా ఇంతేలే అనిపించేలా కాస్త డ్యామేజ్ జరిగిందన్నది మాత్రం నిజం.

Follow Us:
Download App:
  • android
  • ios