నాకే ఫుడ్ లేదని చెబుతావా అంటూ కోపంతో ఊగిపోయిన సందీప్ తన వద్ద ఉన్న సర్వీస్ రివాల్వర్‌తో రెండు రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యాడు.
ఆహారం లేదన్న చిన్న మాటకు ఓ హోటల్ యజమానిపై కాల్పులు జరిపాడో కానిస్టేబుల్.
Add Asianetnews Telugu as a Preferred Source

వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లా ముజఫర్‌నగర్‌లోని సీజీవో కాంప్లెక్స్‌లో సీజీవోగా విధులు నిర్వర్తిస్తున్న సందీప్ బాలియన్ శుక్రవారం రాత్రి 10 గంటలకు భోజనం కోసమని దగ్గర్లోని దాబాకు వెళ్లాడు.
అయితే అప్పటికే అర్థరాత్రి కావొస్తుండటంతో ఆహారం లేదని దాబా యజమాని ఆజాద్ కుమార్ పేర్కొన్నారు. నాకే ఫుడ్ లేదని చెబుతావా అంటూ కోపంతో ఊగిపోయిన సందీప్ తన వద్ద ఉన్న సర్వీస్ రివాల్వర్‌తో రెండు రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యాడు.
అయితే ఈ ఘటనలో ఆజాద్ కుమార్ తృుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఆయన ఫిర్యాదు మేరకు సందీప్‌పై సెక్షన్ 307 కింద పొలీసులు కేసు నమోదు చేశారు.
