చెన్నై:లాక్ డౌన్  వేళ తాను ప్రేమించిన యువకుడి ఇంటికి వెళ్లి అతడిని పెళ్లి చేసుకొంది ఓ యువతి. ఈ పెళ్లిని వ్యతిరేకించిన యువతి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. అమ్మాయి కుటుంబసభ్యులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో కథ సుఖాంతమైంది.

తమిళనాడు రాష్ట్రంలోని కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి.ఈ తరుణంలో పలు చోట్ల 144 సెక్షన్ విధించింది ప్రభుత్వం. రాష్ట్రంలోని తిరుచ్చి పట్టణంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. 

తిరుచ్చి చింతామణి గాంధీనగర్‌కు చెందిన  వినోద్ వయస్సు 25. ఆయన ఐటీఐ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఆయన అరియమంగళంలో బస్సు, లారీలకు బాడీ తయారు చేసే షెడ్డులో పనిచేస్తున్నాడు.

తిరుచ్చి పట్టణంలోని మదురై రోడ్డు జీవానగర్ కు చెందిన జీవితకు 20 ఏళ్లు. ఆమె సత్రం బస్టాండ్ వద్ద ఉన్న ప్రైవేట్ కాలేజీలో ఆమె బీఎస్‌సీ మూడో సంవత్సరం చదువుతోంది.

కాలేజీకి సమీపంలోని పూజారి వీధిలో జీవిత స్నేహితురాలు ఉండేది. అప్పుడప్పుడు ఆమె తన స్నేహితురాలికి ఇంటికి వెళ్లివస్తూ ఉండేది.ఈ క్రమంలోనే జీవితకు, వినోద్ కు మధ్య పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారింది.వీరిద్దరి కులాలు వేరు. వీరి ప్రేమ విషయం రెండు కుటుంబాలకు తెలిసింది.

also read:జర్నలిస్టులకు కరోనా దెబ్బ: ముంబైలో 53 మందికి కరోనా

జీవిత కుటుంబ సభ్యులు ఈ ప్రేమను వ్యతిరేకించారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను లాక్ డౌన్ అమల్లో ఉంది. ఈ తరుణంలో ఆదివారం నాడు జీవిత ప్రియుడి ఇంటికి చేరుకొంది. దీంతో జీవిత, వినోద్ లు కీల్ చింతామణి వద్ద ఉన్నద్రౌపది అమ్మన్ ఆలయంలో వివాహం చేసుకొన్నారు. 

ఈ విషయం అమ్మాయి కుటుంబసభ్యులకు తెలిసింది. వెంటనే వారు తమ కూతురును ఇంటికి పంపాలంటూ కోటై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీస్ ఇన్స్ పెక్టర్ షణ్ముగ వేల్ అమ్మాయి కుటుంబసభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో జీవిత కుటుంబసభ్యులు ఈ పెళ్లికి అంగీకరించారు.