న్యూఢిల్లీ: ముంబైలోని సుమారు 53 మంది జర్నలిస్టులకు కరోనా సోకింది. సుమారు 167 మంది జర్నలిస్టులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తే 53 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని స్థానిక మీడియా సంస్థ ప్రకటించింది.

ఇంకా మరికొందరి శాంపిల్స్ ల్యాబ్ కు పంపారు. వీటి రిపోర్ట్స్ ఇంకా రావాల్సి ఉందని అధికారులు ప్రకటించారు. ఈ నెల 16,17 తేదీల్లో  జర్నలిస్టులు, వీడియో జర్నలిస్టులు, మీడియా వాహనాల డ్రైవర్లు, మీడియా టెక్నీషీయన్లు సుమారు 170 మందికి పరీక్షలు నిర్వహించారు. అయితే వీరిలో 53 మమంది ఫలితాలు మాత్రమే వచ్చాయని ఆ మీడియా సంస్థ తెలిపింది.

కరోనా సోకిన జర్నలిస్టులకు ఎవరికి కూడ ఇప్పటివరకు కరోనా లక్షణాలు కూడ కన్పించకపోవడం గమనార్హం. కరోనా సోకిన జర్నలిస్టులను ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

కరోనా సోకిన జర్నలిస్టులు ఇప్పటివరకు ఎవరెవరితో సన్నిహితంగా ఉన్నవారెవరో గుర్తించి వారికి కూడ పరీక్షలు నిర్వహించనున్నారు.ఎక్కువగా టీవీ జర్నలిస్టులకు కరోనా సోకిందని సమాచారం.మ‌హారాష్ట్రలో ‌4,203 మందికి క‌రోనా కేసులు న‌మోద‌వ‌గా 223 మంది మర‌ణించారు. 507 మంది క‌రోనాను జ‌యించి ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు