అస్సాంలో పోలీసులపై ప్రజల ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. ఓ వ్యక్తిని పోలీసులు కస్టడీలో కొట్టి చంపారని ఆరోపిస్తూ మృతుడి బంధువులు అంతా కలిసి వెళ్లి స్టేషన్ కు నిప్పుపెట్టారు. పోలీసులపై దాడి చేశారు. 

అస్సాంలో ఓ చేపల వ్యాపారి పోలీసు కస్టడీలో మరణించాడ‌ని ఆరోపిస్తూ వంద‌లాది మంది గుంపుగా వ‌చ్చి ఆగ్ర‌హంతో పోలీసు స్టేష‌న్ కు నిప్పు పెట్టారు. ఘ‌ట‌నలో ముగ్గురు గాయాల‌పాల‌య్యార‌ని పోలీసులు తెలిపారు. ముగ్గురు నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నారు. 

దీనికి సంబంధించిన వివ‌రాల ఇలా ఉన్నాయి. సఫీకుల్ ఇస్లాం అనే చేప‌ల వ్యాపారిని శుక్రవారం రాత్రి నాగోన్‌ బపోలీసులు అరెస్టు చేశారు. అయితే అతను మద్యం మత్తులో రోడ్డుపై కనిపించాడని, స్థానికులు సమాచారం ఇవ్వడంతో అస్సాంలోని నాగావ్ జిల్లాలోని బటద్రవ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఢిల్లీలో ఘోరం.. ఒకే ఇంట్లో మూడు మృత‌దేహాలు ల‌భ్యం.. అస‌లేం జ‌రిగిందంటే ?

అయితే శ‌నివారం రోజు చేప‌ల వ్యాపారి ఇస్లాం భార్య అత‌డిని క‌ల‌వ‌డానికి పోలీసు స్టేష‌న్ కు వెళ్లింది. కానీ ఇస్లాం అస్వస్థతతో ఉన్నారని, ఆసుపత్రిలో చేర్పించామ‌ని పోలీసులు చెప్పారు. దీంతో ఆమె హాస్పిటల్ కు వెళ్లింది. అయితే అక్క‌డ అత‌డు మృతి చెందాడ‌నే వార్త విని షాక్ కు గుర‌య్యింది. ఇస్లాం మృతి చెందాడ‌నే వార్త కుటుంబీకుల‌కు తెలియ‌డంతో ఆ హాస్పిటల్ కు చేరుకున్నారు.

అత‌డి మృతిపై కోపోద్రిక్తులైన బాధిత కుటుంబంలోని పురుషులు, మ‌హిళ‌లు, బంధువుల క‌లిసి ఆ పోలీస్ స్టేష‌న్ కు వెళ్లారు. ముందుగా పోలీసుల‌పై దాడి చేశారు. అనంత‌రం స్టేష‌న్ కు నిప్పు పెట్టారు. అగ్నిప్రమాదంలో స్టేష‌న్ లో ఉన్న ప‌లు ప‌త్రాలు కాలి బూడిద అయ్యాయి. కొన్ని రైఫిళ్లు కూడా దెబ్బతిన్నాయి. ఈ ఘ‌ట‌న‌పై అయితే మృతుడి భార్య మాట్లాడుతూ.. నాగావ్ జిల్లాలోని సల్నాబరి ప్రాంతం నుంచి తన భర్తను పోలీసులు పట్టుకున్నారని తెలిపారు. విడిచిపెట్టాలంటే ఒక బాతుతో పాటు రూ.10,000 ఇవ్వాలని పోలీసులు డిమాండ్ చేశారని ఆమె ఆరోపించారు. అయితే తాము ఒక బాతును ఇచ్చామ‌ని అన్నారు. కానీ విసిగిపోయిన పోలీసులు త‌న‌ భర్తను దారుణంగా కొట్టి చంపారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 

భార‌త విదేశాంగ విధానం భేష్.. అమెరికాకు కూడా తలొగ్గ‌డం లేదు - పాక్ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్

అయితే ఆమె ఆరోప‌ణ‌ల‌ను పోలీసులు ఖండించారు. ఇస్లాం పోలీసు స్టేష‌న్ లో అస్వ‌స్థ‌త‌కు గురికావ‌డంతో తాము అత‌డి కుటుంబ స‌భ్యుల‌కు స‌మాచారం అందించి స్థానిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లామ‌ని చెప్పారు. అక్క‌డి డాక్ట‌ర్లు జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేశార‌ని తెలిపారు. జిల్లా ఆసుపత్రికి తరలించిన‌ప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించార‌ని అన్నారు. విచారణ కొనసాగుతోందని, దోషులుగా తేలిన వారిపై చర్యలు తీసుకుంటామని నాగావ్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ లీనా డోల్ తెలిపారు. 

Scroll to load tweet…

ఈ ఘ‌ట‌న‌పై డీజీపీ భాస్కర్ జ్యోతి మహంత మాట్లాడుతూ.. షఫీకుల్ ఇస్లాం దురదృష్టకర మరణాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపారు. త‌మ వైపు నుంచి ఏదైనా త‌ప్పు జ‌రిగితే దోషుల‌ను శిక్షిస్తామ‌ని చెప్పారు. కాల్పులు జరిపిన వారు మృతుల బంధువులుగా భావించడం లేదని అన్నారు. కాగా పోలీస్‌స్టేషన్‌లో దహనం చేసిన ఘటనలో ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్టు చేశారు. మరికొందరిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.