Asianet News TeluguAsianet News Telugu

వంతెనపై నుంచి దూకి యువకుడి ఆత్మహత్యాయత్నం.. చాకచక్యంగా కాపాడిన పోలీస్.. వీడియో వైరల్...

గౌహతిలోని సరైఘాట్ ఫ్లైఓవర్ మీదినుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన యువకుడిని ఓ పోలీసు అత్యంత ధైర్య సాహసాలతో రక్షించాడు. 

Police Rescues 26-Year-Old From Suicide Attempt On River Bridge in Assam - bsb
Author
First Published Apr 29, 2023, 4:01 PM IST

గౌహతి : అస్సాంలోని గౌహతిలో ఒక పోలీసు అత్యంత సాహసాన్ని ప్రదర్శించాడు. వీరోచితమైన స్పందనతో ఓ 26యేళ్ల వ్యక్తి ప్రాణాలు కాపాడాడు. ఈ ఘటన శుక్రవారం గౌహతిలో వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో అతని మీద ప్రశంసల జల్లు కురుస్తోంది. తన సాహసోపేత కార్యక్రమానికి గానూ రాష్ట్ర పోలీసుల నుండి నగదు పురస్కారం కూడా అందుకున్నాడు.

బ్రహ్మపుత్ర నదిపై నున్న సరైఘాట్ వంతెనపైనుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న లంకేశ్వర్ కలిత్ అనే పోలీసులు సాహసంగా అతడిని పట్టుకుని ఆపడంతో ప్రాణాలు నిలిచాయి. ఈ వైరల్ అయిన వీడియోలో లంకేశ్వర్ కలిత్ అనే పోలీసు, భారీ గుంపు వీక్షిస్తున్నప్పుడు వంతెన సరిహద్దు గోడను నెమ్మదిగా దిగుతూ...ఒక గట్టుపై కూర్చున్న వ్యక్తిని కదలొద్దని సైగ చేయడం కనిపిస్తుంది. 

మన్ కీ బాత్ వందో ఎపిసోడ్ కు అతిథిగా వచ్చిన మహిళకు పురిటినొప్పులు.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన పూనమ్...

ఆ తరువాత అత్యంత సాహసోపేతంగా నెమ్మదిగా వ్యక్తిని సమీపించి, అతడిని పట్టుకోవడం కనిపిస్తుంది. మధ్యాహ్నం 3:20 గంటలకు గౌహతిలోని సరైఘాట్ ఫ్లైఓవర్ మీద ఈ నాటకీయ సంఘటన జరిగింది. దీని గురించి పోలీసులు మాట్లాడుతూ.. సరైఘాట్ వంతెనపై నుంచి బ్రహ్మపుత్ర నదిలోకి దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. 

జలుక్‌బరి ఔట్‌పోస్ట్‌లోని పోలీసు బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంది జలుక్‌బరి అవుట్‌పోస్ట్‌కు చెందిన లంకేశ్వర్ కలిత్ తన పోలీసు డ్యూటీకే ఆదర్శప్రాయంగా వ్యవహరించాడు.  ధైర్యం, అంకితభావాన్ని ప్రదర్శించాడు. తన ప్రాణాలకు భయపడకుండా వ్యక్తిని రక్షించాడు".. అతని ధైర్య సాహసాలను మెచ్చుకున్న అధికారులు అతనికి బహుమతిగా రూ. 10,000 బహుమతిగా ఇచ్చారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios