మన్ కీ బాత్ వందో ఎపిసోడ్ కోసం హాజరైన ఓ మహిళకు కార్యక్రమంలోనే పురిటినొప్పులు వచ్చాయి. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించగా.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. 

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని మన్‌కీ బాత్ @100 కాంక్లేవ్‌కు హాజరైన స్వయం సహాయక బృందం సభ్యురాలు పూనమ్ దేవి మగబిడ్డకు జన్మనిచ్చింది. బుధవారం విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కాన్‌క్లేవ్‌కు ప్రత్యేక ఆహ్వానితులలో పూనమ్ దేవి కూడా ఉన్నారు, మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలోని ఒక ఎపిసోడ్‌లో లఖింపురి ఖేరీ సమీపంలోని స్వయం సహాయక బృందంలో ప్రధాని ఆమె చేసిన పని గురించి మాట్లాడారు.

కాన్‌క్లేవ్ సందర్భంగా విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమానికి పూనమ్ హాజరయ్యారు. ఆమె నిండు గర్భిణీ.. కాన్ క్లేవ్ లో పురుటి నొప్పుడు రావడంతో వెంటనే ఆమెను రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె ఆరోగ్యకరమైన మగబిడ్డకు జన్మనిచ్చిందని ఒక అధికారి తెలిపారు.

మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్.. ప్రధాని మోదీకి బిల్‌గేట్స్ అభినందనలు.. ఏం చెప్పారంటే..

లఖింపూర్ ఖేరీలోని స్వయం సహాయక బృందం అరటి బోదెనుంచి ఫైబర్‌ తీసి... దాని సహాయంతో హ్యాండ్‌బ్యాగ్‌లు, చాపలు, ఇతర వస్తువులను ఉత్పత్తి చేస్తుంది, దీనివల్ల గ్రామంలోని మహిళలు స్వయంఉపాధిని... అదనపు ఆదాయాన్ని సాధించారు. వ్యర్థాలను తగ్గించడంలో కూడా దోహదపడుతుంది.

సమాజానికి చేసిన విశేషమైన కృషి చేసిన వారిని ప్రధాని తన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించారు. విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమానికి ఆహ్వానించిన 100 మంది ఆహ్వానితులలో పూనమ్ కూడా ఉన్నారు. ఆదివారం ప్రసారం కానున్న మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్‌ను పురస్కరించుకుని రోజంతా కాన్‌క్లేవ్ నిర్వహించారు.

కాన్‌క్లేవ్‌ను ఉపాధ్యక్షుడు జగదీప్ ధంకర్ ప్రారంభించారు. సదస్సులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్, సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తదితరులు ప్రసంగించారు.

Scroll to load tweet…