సారాంశం

ఈజీ మనీ కోసం కొందరు వ్యక్తులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఆడవాళ్లను బలవంతంగా వ్యభిచార కూపంలోకి లాగి డబ్బులు దండుకుంటున్నారు. 

ఈజీ మనీ కోసం కొందరు వ్యక్తులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఆడవాళ్లను బలవంతంగా వ్యభిచార కూపంలోకి లాగి డబ్బులు దండుకుంటున్నారు. దేశంలోని పలుచోట్ల ఇలాంటి దందాలు సాగుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని థానే జిల్లా స్పా సెంటర్ ముసుగులో జరుగుతున్న వ్యభిచార రాకెట్‌ గుట్టును పోలీసులు రట్టు చేశారు. ముగ్గురు మహిళలను రక్షించిన పోలీసులు.. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వివరాలు..  థానే జిల్లాలోని కాషిమీరా ప్రాంతంలోని ఓ  స్పా సెంటర్‌పై పోలీసులు ఆదివారం దాడులు  నిర్వహించారు.

అక్కడ స్పా సెంటర్ ముసుగులో మహిళలతో వ్యవభిచారం నడిపిస్తున్నారని గుర్తించి.. ముగ్గురు మహిళలను రక్షించారు. స్పా సెంటర్ నుంచి ఇద్దరు వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు. వారిలో ఒకరు అక్కడ పనిచేస్తున్న మేనేజర్ కాగా, మరో వ్యక్తి స్పీపర్. వారిపై పలు భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని వివిధ సెక్షన్లతో పాటు ప్రివేన్షన్ ఆఫ్ ఇమ్మోర్టల్ ట్రాఫికింగ్ రెగ్యులేషన్స్ కింద కూడా కేసు నమోదు చేశారు. స్పా సెంటర్ యజమానిపై కూడా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ఒక అధికారి తెలిపారు.