ఒకే కుటుంబంలో నలుగురి హత్య: హంతకులెవరు?

Police probe murder angle as four bodies are dug up days after Kerala family went missing
Highlights

కేరళలోని  ఒకే కుటుంబంలోని  నలుగురు సభ్యులు అనుమానాస్పదస్థితిలో మరణించారు. మృతదేహలు కూడ ఇంటి ఆవరణలో పూడ్చి ఉన్నాయి. ఈ ఘటన  కేరళలోని ఇడుక్కి జిల్లాలోని తొడుపుజ ప్రాంతంలో  చోటు చేసుకొంది.

తిరువనంతపురం: కేరళలోని  ఒకే కుటుంబంలోని  నలుగురు సభ్యులు అనుమానాస్పదస్థితిలో మరణించారు. మృతదేహలు కూడ ఇంటి ఆవరణలో పూడ్చి ఉన్నాయి. ఈ ఘటన  కేరళలోని ఇడుక్కి జిల్లాలోని తొడుపుజ ప్రాంతంలో  చోటు చేసుకొంది.

కేరళ రాష్ట్రంలోని  ఇడుక్కి జిల్లాలోని  తొడుపుజ కు చెందిన ఒ కే కుటుంబానికి చెందిన  భార్య,భర్తలు,  కొడుకు, కూతురు  అనుమానాస్పదస్థితిలో మరణించారు.  ఆ మృతదేహలను ఇంటి వెనుక గొయ్యి తీసి పూడ్చేశారు. అయితే ఈ ఇంటికి చెందిన వారెవరూ కూడ ఇంట్లో నుండి బయటకు రాకపోవడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ సమాచారం ఆధారంగా పోలీసులు  విచారణ చేస్తే ఈ నలుగురు  మృతిచెందిన విషయాన్ని  గుర్తించారు.

ఇంట్లో అక్కడక్కడ  రక్తపు మరకలు కన్పించాయి. దీంతో  పోలీసులు ఇంట్లో నిశితంగా పరిశీలించారు. అయితే ఇంటి వెనుక ప్రాంతంలో గొయ్యి తీసిన ఆనవాళ్లు కన్పించాయి. దీంతో ఆ ప్రాంతంలో తవ్వి చూస్తే నాలుగు మృతదేహలు బయటపడ్డాయి.

 మృతులను కె.కృష్ణన్, ఆయన భార్య సుశీల, ఆయన కుమార్తె అర్ష, కుమారుడు అర్జున్‌లుగా గుర్తించారు.  మృతుల శరీరాలపై  బలమైన గాయాలను గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. కత్తి, సుత్తి లాంటి ఆయుధాలను పోలీసులు సంఘటనా స్థలం నుండి స్వాధీనం చేసుకొన్నారు. 

 మృతదేహలను  పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  కృష్ణన్‌కు రబ్బర్‌ ప్లాంట్‌ ఉందని, అయితే ఆయన జ్యోతిష్కుడు అని, తాంత్రిక పూజలు చేస్తాడనే అనుమానాలు ఉన్నాయని తెలిపారు.

loader