బెంగుళూరు:  ప్రేమ వివాహనికి అబ్బాయి కుటుంబసభ్యులు ఒప్పుకోకపోవడంతో  పోలీసులే పెళ్లి పెద్దలుగా  ముందుండి ప్రేమికులకు పెళ్లి జరిపించారు. పోలీసులే తమ పెళ్లికి పెద్దలుగా  కావడంతో ఆ ప్రేమ జంట హర్షం వ్యక్తం చేస్తోంది.

కర్ణాటక రాష్ట్రంలోని   దక్షిణ బెంగుళూరు పరప్పర  ఆగ్రహార కొత్త రోడ్డులో  నివసిస్తున్న కృష్ణమూర్తి అనే యువకుడు  అదే గ్రామానికి చెందిన సంధ్య అనే యువతిని ప్రేమిస్తున్నాడు. రెండేళ్లుగా వీరిద్దరి మధ్య ప్రేమాయాణం సాగుతోంది. 

అియతే ఈ విషయం రెండు కుటుబాల పెద్దలకు తెలిసింది. కానీ, వీరిద్దరి వివాహనికి అబ్బాయి కటుంబసభ్యులు ఒప్పుకోలేదు. సంధ్య కుటుంబసభ్యులు మాత్రం ఒప్పుకొన్నారు. సంధ్య కుటుంబసభ్యులే ఈ వివాహనికి ఏర్పాట్లు చేశారు. ఈ నెల 8,9 తేదీల్లో టీ.బేగూరులోని విరాట భవనంలో వీరిద్దరి వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు చేశారు.

 అయితే ఈ విషయం తెలిసిన కృష్ణమూర్తి కుటుంబసభ్యులు విరాట భవనం వద్దకు వచ్చి గొడవకు దిగారు.కృష్ణమూర్తికి  వివాహ వయస్సు రాలేదని  ఆయన అభ్యంతం తెలిపారు. దీంతో కృష్ణమూర్తి  తన వయస్సు ధృవీకరణ పత్రాలను  పోలీసులకు అందించారు. వధువు కూడ ఈ మేరకు  తన వయస్సు ధృవీకరణ పత్రాలను పోలీసులకు చూపింది.

ఇద్దరూ మేజర్లేనని పోలీసులు ధృవీకరించారు. పోలీసులే ఈ ప్రేమికుల వివాహనికి ముందు నిలిచారు. వివాహం పూర్తయ్యే వరకు అక్కడే ఉన్నారు. పెళ్లి జరిపించి నూతన వధూవరును వారి ఇంటికి పంపించారు.