ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. తన తోటి ఉద్యోగి కావడం.. గౌరవ ప్రదమైన పోలీసు పదవిలో ఉండటంతో అతని మాటలను ఆమె నమ్మేసింది. అతను చెప్పిందంతా నిజమని నమ్మి.. తన సర్వస్వం అర్పించుకుంది. తీరా పెళ్లి ఊసు ఎత్తేసరికి తప్పించుకోవడం మొదలుపెట్టాడు. అనుకోకుండా.. ఎవరికీ తెలికుండా మరో యువతిని పెళ్లాడాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో ని నాగపూర్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

వెల్టూరు ట్రాఫిక్ పోలీసు విభాగంలో పనిచేస్తున్న పోలీసు కానిస్టేబుల్ తన తోటి ఉద్యోగిని అయిన మహిళా కానిస్టేబుల్ ను ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు.  పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించాడు. అతని మాయమాటలను ఆమె కూడా నమ్మేసింది. ఈ క్రమంలో ఇద్దరూ శారీరకంగా కలిసారు. 

 గత కొంత కాలంగా ఆమెకు మాయ మాటలు చెబుతూ  పలుసార్లు అత్యాచారానికి పాల్పడుతూనే ఉన్నాడు. ఈ పోలీసు కానిస్టేబుల్ 2015వ సంవత్సరం నుంచి మహిళా కానిస్టేబుల్ తో శారీరక సంబంధం పెట్టుకోవడం గమనార్హం. పెళ్లి మాట ఎత్తే సరికి.. తప్పించుకు తిరగడం మొదలుపెట్టాడు. కాగా..  ఇటీవల అతను మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాగపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.