శ్రీనగర్‌లోని పాంథా చౌక్‌లో పోలీసు బస్సుపై కాల్పులు జరిపిన తొమ్మిది మంది ఉగ్రవాదులను గడిచిన 24 గంటల్లో హతమార్చినట్లు జమ్మూ కాశ్మీర్ డీజీపీ దిల్‌బాగ్ సింగ్ ప్రకటించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది జమ్ముకాశ్మీర్ జరిగిన ఆపరేషన్ల వివరాలు వెల్లడించారు.
శ్రీనగర్‌లోని పాంథా చౌక్‌లో పోలీసు బస్సుపై దాడికి పాల్పడిన తొమ్మిది మంది ఉగ్రవాదులను గడిచిన 24 గంటల్లో హతమార్చినట్లు జమ్మూ కాశ్మీర్ డీజీపీ దిల్‌బాగ్ సింగ్ ప్రకటించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. డిసెంబరు 13వ తేదీన శ్రీనగర్ శివార్లలో ఒక పోలీసు బస్సుపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారని తెలిపారు. ఈ ఘటనలో ఒక అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్‌తో పాటు మరో ముగ్గురు పోలీసులు మరణించగా.. మరో 11 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారని చెప్పారు. ఇందులో పాకిస్తాన్‌కు చెందిన జైష్-ఎ-మొహమ్మద్ (JeM)కి చెందిన కాశ్మీర్ టైగర్స్ కు హస్తముందని గుర్తించి వారిపై దాడి దేశామని తెలిపారు. ఈ దాడిలో ఒక పోలీసుకు గాయాలయ్యాయని చెప్పారు.
ఉత్తరప్రదేశ్‌లో మరోసారి ఐటీ దాడుల కలకలం.. ఈసారి ఎమ్మెల్సీ పుష్ప రాజ్ జైన్ ఇంట్లో..
ఈ ఏడాదిలో 44 మంది టాప్ టెర్రరిస్టులు హతం
2021 సంవత్సరం మొత్తంలో జమ్మూకాశ్మీర్‌లో విజయవంతమైన 100 ఆపరేషన్లు నిర్వహించామని జమ్మూ కాశ్మీర్ డీజీపీ దిల్‌బాగ్ సింగ్ తెలిపారు. ఆ ఆపరేషన్ల ద్వారా 44 మంది టాప్ టెర్రరిస్టులను హతమార్చినట్టు పేర్కొన్నారు. ఈ ఏడాది 34 మంది ఉగ్రవాదులు మాత్రమే చొరబాటుకు పాల్పడ్డారని చెప్పారు. ఈ ఏడాది జమ్మూకాశ్మీర్‌లో 80 మంది ఉగ్రవాదులను అరెస్టు చేశామని, 497 మందిపై UAPA చట్టం కింద నమోదు చేశామని తెలిపారు.
ఈ ఏడాది 134 మంది యువకులు జమ్ముకాశ్మీర్‌లో టెర్రర్ గ్రూపుల్లో చేరారని డీజీపీ తెలిపారు. వీరిలో 72 మందిని తిరిగి పౌరులుగా మార్చామని చెప్పారు. 22 మందిని అరెస్టు చేశామని తెలిపారు. ఈ ఏడాది మొత్తంగా 30,000 నేరాల కేసులు నమోదయ్యాయని అన్నారు. పోలీస్ ఫోర్స్‌లో కరోనా సోకిన వారి వివరాలు కూడా డీజీపీ వెల్లడించారు. ఈ ఏడాది 2500 మంది సిబ్బందికి కరోనా సోకిందని అన్నారు. 12 మంది పోలీసులు కరోనా వల్ల మృతి చెందారని తెలిపారు. ఇతర కారణాల వల్ల జమ్మూ కాశ్మీర్ పోలీసులు 20 మంది, 23 ఇతర పోలీసు బలగాలు అమరులయ్యారని చెప్పారు.
హైదర్‌పోరా సిట్‌పై విమర్శలు బాధపెట్టాయి.
హైదర్‌పోరా ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు కొనసాగిస్తున్న సిట్‌పై గుప్కర్ నాయకులు చేస్తున్న విమర్శలు బాధించాయని డీజీపీ అన్నారు. వాస్తవ పరిస్థితుల గురించి తెలియని కొందరు వ్యక్తులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడినప్పుడు చాలా బాధగా అనిపించిందని అన్నారు.
గాడిదల చోరీతో పోలీసులకు తంటా.. స్టేషన్ ఎదుట ధర్నా.. ‘ఇవి మా గాడిదలు కావు.. అవి పిలిస్తే వస్తాయి’
171 మంది ఉగ్రవాదులు హతం..- ఐజీపీ విజయ్ కుమార్
2021లో లోయలో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్న 171 మంది ఉగ్రవాదులు హతమయ్యారని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. ‘‘ ఈ ఏడాది మొత్తం 171 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. వారిలో 19 మంది పాకిస్తానీ ఉగ్రవాదులు. 152 మంది స్థానిక ఉగ్రవాదులు. గతేడాది 37 మంది పౌరులు మరణించారు. అయితే ఈ సంవత్సరం 34 మంది పౌరులు మరణించారు’’ అని ఆయన తెలిపారు.
