ప్రేమిస్తున్నానంటూ వెంట పడ్డాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఆమెను నానా రకాలుగా వేధించాడు. అయితే... యువతి ససేమిరా అనడంతో కోపంతో రగిలిపోయాడు. పథకం ప్రకారం ఆమెను కిడ్నాప్ చేసి అనంతరం అతి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం ఊరి చివర ఆమె మృతదేహాన్ని పడేశాడు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... తమిళనాడుకి చెదిన యువతి(17) మంగళవారం కాలేజీకి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. యువతి కోసం ఆమె తల్లిదండ్రులు పలు ప్రాంతాల్లో గాలించినా ఎలాంటి ఆచూకీ దొరకలేదు. దీంతో... వెంటనే అదే రోజు సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా తమ కూతురి వెనుక కొంతకాలం నుండి జాఫర్ షా(26) అనే వ్యక్తి ప్రేమ, పెళ్లి పేరిట వెంటపడుతున్నాడని.. అతనిపైనే తమకు అనుమానంగా ఉందని అతను పోలీసులకు వివరించాడు.

AlsoRead రక్తపు మడుగులో చూశా.. నా గుండె రాయి అయిపోయింది... నిర్భయ తల్లి

యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కదలికలపై దృష్టిపెట్టారు. నిందితుడు జాఫర్ షా... ఓ ఆటో మొబైల్ సర్వీస్ సెంటర్ లో పనిచేస్తున్నాడు. అతని మొబైల్ లోకేషన్ ఆధారంగా ట్రాక్ చేయగా... తమిళనాడులోని వలపరాయ్ లో ఉన్నట్లు గుర్తించారు.

అక్కడికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు యువతి గురించి ఆరా తీశారు. ముందు తనకు ఏమీ తెలియదని వాదించినా... పోలీసులు తమదైన రీతిలో ప్రశ్నించగా నిజం అంగీకరించాడు. యవతిని చంపేసి ఊరిచివర పడేసినట్లు తెలిపాడు. అతను చెప్పిన ప్రాంతానికి వెళ్లి.. పోలీసులు యువతి మృతదేహాన్ని స్వాధీనపరుచుకున్నారు. నిందితుడిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నట్లు చెప్పారు.