కన్న తండ్రే చాలా కర్కశంగా ప్రవర్తించాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిందిపోయి... రాక్షసుడిలా ప్రవర్తించాడు. భార్యపై ఉన్న కోపాన్ని కన్న బిడ్డలపై చూపించాడు. ఇద్దరు బిడ్డలను 150 అడుగుల లోయలో పడేశాడు. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... తమిళనాడులోని నామక్కల్‌ జిల్లా సెందూరుచక్కపారై సమీపంలో ఘటన చోటు చేసుకుంది. చిరంజీవి అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. బాధిత చిన్నారుల తల్లి ఫిర్యాదు మేరకు తండ్రి చిరంజీవిని పోలీసులు అరెస్టు చేశారు. చిన్నారుల కోసం గాలింపు చర్యలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా... ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. దుబాయ్‌కు వెళ్లిన తన భార్య  డబ్బులు పంపడం లేదనే నెపంతో ఏషియా అనే వ్యక్తి తన ఇద్దరు చిన్నారులను బెల్టులతో చితకబాదాడు.ఈ వీడియోను తన భార్యకు పంపాడు.  ఈ వీడియోలను చూసిన తర్వాత బాధితుల తల్లి విజయలక్ష్మి కోరిక మేరకు  పిల్లల మేనమామ పిల్లలను తీసుకెళ్లాడు.ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలంలోని సార్సా గ్రామంలో చోటు చేసుకొంది.

ఏడేళ్ల క్రితం ఏషియా, విజయలక్ష్మిలు ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. ఏషియా మాత్రం ఎలాంటి పనులు చేయడం లేదు. పెద్ద కూతురు పుట్టిన తర్వాత భార్యాభర్తల మధ్య వివాదం చోటు చేసుకొంది.ఈ వివాదం కారణంగా విజయలక్ష్మి పుట్టింట్లోనే ఉంది.

పెద్ద మనుషులు పంచాయితీ నిర్వహించడంతో భార్యాభర్తలు కాపురం చేశారు. ఏషియా ఏ పని చేయకపోవడంతో విజయలక్ష్మి తమ పిల్లలను పోషించేందుకు గాను  విజయలక్ష్మి  దుబాయ్‌కు వెళ్లింది.

AlsoRead సోషల్ మీడియాలో పరిచయం: బర్త్‌డే పార్టీకి వెళ్లి ప్రియుడి చేతిలో వివాహిత హత్య...

దుబాయ్ నుండి భర్తకు ప్రతి నెలా డబ్బులను పంపేది.. అయితే ఈ డబ్బులను తీసుకొన్న ఏషియా పిల్లల బాగోగులు చూడలేదు. మద్యానికి బానిసగా మారాడు. అంతేకాదు పిల్లల కోసం పంపిన డబ్బులను  కూడ మద్యం కోసం ఉపయోగించేవాడు.

ఈ విషయం తెలిసిన విజయలక్ష్మి ఏషియాకు డబ్బులు పంపడం నిలిపివేసింది. దీంతో మద్యానికి  బానిసగా మారిన ఏషియా తన పిల్లలపై ప్రతాపం చూపాడు. పిల్లలను బెల్ట్‌తో పాటు, కరెంటు వైర్లతో ఇష్టమొచ్చినట్టు కొట్టేవాడు.

పిల్లలను కొడుతున్న దృశ్యాలను వీడియో తీసి  తన భార్య విజయలక్ష్మికి ఫోన్‌లో షేర్ చేశాడు. ఈ వీడియోలను చూసిన తర్వాత  విజయలక్ష్మి తన పిల్లలను 

తీసుకెళ్లాలని సోదరుడిని కోరింది.

విజయలక్ష్మి సూచన మేరకు పిల్లల మేనమామ ఆ పిల్లలను తమ ఇంటికి తీసుకెళ్లాడు. తండ్రి వద్దకు వెళ్లబోమని పిల్లలు చెబుతున్నారు. రక్తాలు వచ్చేలా పిల్లలను ఏషియా తీవ్రంగా కొట్టాడు.

తండ్రి వద్దకు వెళ్తే తాము బతకలేమని ఆ పిల్లలు భయపడుతున్నారు. కన్నబిడ్డలను చిత్రహింసలు పెట్టిన  ఏషియాను కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. ఏషియాపై కేసు  నమోదు చేసి కఠినంగా శిక్షించాలని పిల్లల బంధువులు కోరుతున్నారు.