పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చి ప్రియుడి చేతిలో ప్రేయసి హతమైంది. వివరాల్లోకి వెళితే.. విక్కిమన్ అనే వ్యక్తి పుట్టినరోజును జరుపుకోవడానికి ఓ వివాహిత ఢిల్లీ అలీపూర్‌లోని ఓ హోటల్‌లో రూమ్ బుక్ చేసింది.

ఇద్దరు కలుసుకుని సరదాగా మాట్లాడుకుంటున్న సమయంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి పెను వివాదానికి దారి తీసింది. ఈ క్రమంలో ఇద్దరు అసభ్యంగా దూషించుకుంటూ కొట్లాటకు దిగారు.

కోపాన్ని ఆపుకోలేని విక్కీ కత్తితో ప్రియురాలిని అత్యంత కిరాతకంగా హత్య చేసి అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. మంగళవారం ఉదయం టిఫిన్ ఇచ్చేందుకు ఆ గదికి వెళ్లిన హోటల్ సిబ్బంది లోపలి దృశ్యాన్ని చూసి ఆందోళనకు గురయ్యారు.

Also Read:భార్య స్నానం చేస్తుండగా వీడియో తీసి....సోషల్ మీడియాలో పెడతానంటూ..

సదరు మహిళ రక్తపు మడుగులో పడివుండటంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు.

హోటల్ రిసెప్షన్ వద్ద నమోదు చేసిన వివరాల ఆధారంగా పోలీసులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వివాహితను హత్య చేసిన విక్కీమన్‌ను మంగళవారం మధ్యాహ్నం అలీపూర్ ప్రాంతంలో అరెస్ట్ చేశారు. తనపై అకారణంగా చేయి చేసుకుందని.. ఇద్దరి మధ్య వివాదం పెరగడంతో కత్తితో ఆమెపై దాడిచేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

కాగా మృతురాలికి గతంలోనే వివాహమైందని.. ఇద్దరు పిల్లలు ఉన్నట్లు కూడా తేలింది. వీరిద్దరికి ఏడాది క్రితం సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడిందని.. గత నెలలో కూడా వీరిద్దరు ఆరు, ఏడు సార్లు హోటల్‌ను సందర్శించినట్లు హోటల్ సిబ్బంది పోలీసులకు తెలిపారు.

Also Read:వలపు వలతో కిలాడీ లేడీలు: బుక్కవుతున్నారిలా..

కొద్దిరోజుల క్రితం సామాజిక మాధ్యమాల్లో మహిళలతో పరిచయం పెంచుకొని వారిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

కేరళ రాష్ట్రంలోని ఎట్టిమనూర్ సమీపంలోని ఆరిపరబుకు చెందిన  ప్రదీశ్‌కుమార్‌ పెళ్లైన మహిళలతో సామాజిక మాధ్యమాల్లో పరిచయం పెంచుకొనేవాడు.  వివాహిత మహిళల ఫోన్ నెంబర్లను తీసుకొని కుటుంబసభ్యులను తెలుసుకొనేవాడు..

ఆ తర్వాత అమ్మాయిల మాదిరిగా నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలను తెరిచేవాడు. తాను అంతకుముందే మాట్లాడిన వివాహిత భర్తలతో అమ్మాయిల మాదిరిగా చాటింగ్ చేసేవాడు.  ఈ చాటింగ్ స్క్రీన్ షాట్లను తీసి వాళ్ల భార్యలకు పంపేవాడు.  ఈ స్క్రీన్ షాట్లను చూసిన వివాహితలు భర్తలతో గొడవ పెట్టుకొనేవారు. దీంతో భార్య, భర్తల మధ్య దూరం పెరిగేది.

భర్తలకు దూరంగా ఉన్న భార్యలు దూరంగా ఉంటున్నారని గుర్తించి వారితో సన్నిహితంగా చాటింగ్ చేసేవారు. వాటి ఫోటోలను అసభ్యంగా మార్చేవారు. వీటిని ఆసరాగా చేసుకొని నిందితుడు బాధితులను లైంగిక దాడి చేసేవాడు.  ఈ  రకంగా సుమారు 50 మంది వివాహితలను ఈ నిందితుడు లోబర్చుకొన్నాడు. నిందితుడి ల్యాప్‌టాప్ నుండి  అసభ్యకరంగా మార్చిన ఫోటోలను స్వాధీనం చేసుకొన్నారు.