కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే.. కామాంధుడు అయ్యాడు. కూతురికి ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవాల్సింది పోయి తానే పెద్ద కష్టంగా మారాడు. కూతురిని లైంగికంగా వేధించి నరకం చూపించాడు. రెండేళ్లపాటు.. కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉర్లా పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అమిత్ తిరవారీ తెలిపిన వివరాల ప్రకారం.. రాయ్ పూర్ కి చెందిన ఓ వ్యక్తి తన కూతురిపై కన్నేశాడు. 18ఏళ్ల కూతురికి రెండేళ్లుగా నరకం చూపించాడు. తండ్రి పెడుతున్న టార్చర్ తట్టుకోలేకపోయిన సదరు యువతి పోలీసులను ఆశ్రయించింది.

గత రెండేళ్లుగా తన తండ్రి తనపై అత్యాచారం చేసి హింసింస్తున్నాడని కూతురు ఆరోపించింది. నిందుతుడు ఆదివారం మళ్లీ బాధితురాలిపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించడంతో ఆమె తన తల్లితో పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. దీంతో అతడిని అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు. నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్లు 294(అశ్లీల చర్యలు), 323(బాధ కలిగించినందుకు శిక్ష), 376(అత్యాచారానికి శిక్ష), పోక్సో(లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ) చట్టం కింద కేసు నమోదుచేసినట్టు పోలీసులు వెల్లడించారు.