చెన్నైలో వేగంగా ప్రయాణిస్తున్న రైలులో పదునైన మరణాయుధాలతో విన్యాసాలు చేస్తూ ప్రయాణీకులను భయాభంత్రులకు గురిచేసిన ముగ్గురు కళాశాల విద్యార్థులను అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పదునైన ఆయుధాలతో చెన్నైలోని ఓ రైలులో విన్యాసాలు చేస్తూ కెమెరాకు చిక్కిన ముగ్గురు కళాశాల విద్యార్థులను అరెస్టు చేసినట్లు డివిజనల్ రైల్వే మేనేజర్ ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌లో ప్రకటించారు. కదులుతున్న రైలు నుండి బయటికి ఓ ఆకతాయుల బృందం వంగి రైల్వే స్టేష్టన్ లో విధ్వంసం సృష్టించారు. ప్లాట్ ఫాంపై నిల్చున్న ప్రయాణికులను దిగ్భ్రాంతికి గురి చేశారు. ఈ ఘటన చెన్నైలోని సబ్-అర్బన్ ప్యాసింజర్ రైళ్లలో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ముగ్గురు వ్యక్తులు గుమ్మిడిపూండికి చెందిన అన్బరసు, రవిచంద్ర, పొన్నేరికి చెందిన అరుల్‌గా గుర్తించారు. వీరంతా ప్రెసిడెన్సీ కాలేజీ విద్యార్థులని తెలిపారు.
రైలులో పటాకులు, కత్తులతో ఎవరైనా ప్రయాణిస్తే 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ.. కాలేజీ విద్యార్థులు ప్లాట్‌ఫారమ్‌పై కత్తితో హల్ చల్ చేస్తూ.. ప్రయాణికులను బెదిరింపులకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైళ్లలో కొడవళ్లు, కత్తులతో ఎవరైనా ప్రయాణించి ప్రయాణికులను బెదిరించే వారికి భారతీయ రైల్వే చట్టంలోని సెక్షన్ 153 ప్రకారం 10 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని పోలీసులు హెచ్చరించారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్న వీడియోలో.. కదులుతున్న రైలులోని ఫుట్‌బోర్డ్ లో దాదాపు ఏడుగురు విద్యార్థులు వేలాడదీయడం చూడవచ్చు. అందులో ఇద్దరు యువకులు మరణాయుధాలను పట్టుకుని కనిపిస్తారు. ఈ సంఘటనతో రైలులో ఉన్న ప్రయాణీకులతో పాటు.. ప్లాట్ ఫామ్ పై ఉన్న ప్రయాణీకులు భయభ్రాంతులకు గురయ్యారు. కొంతమంది యువకులు రైలు కోచ్‌పై కొడవలితో కొట్టడం కూడా ఆ వీడియో చూడవచ్చు. ఇబ్బందికర ప్రవర్తనపై ప్రయాణికులు అధికారులకు ఫిర్యాదు చేయగా.. వారిపై పోలీసులు చర్య తీసుకున్నారు. ప్రమాదకర, చట్టవిరుద్ధమైన స్టంట్‌ను నిర్వహించిన బృందంలోని యువకులే ఈ వీడియోను చిత్రీకరించినట్టు పోలీసులు గుర్తించారు. ఈ పోకిరి చేష్టాల మీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్‌గా మారింది.
ఇదిలా ఉంటే.. ఇటీవల కూడా ఓ కాలేజీ విద్యార్థి రైలు మెట్లకు వేలాడుతూ ప్లాట్‌ఫాంపై ప్రయాణికులను కత్తితో బెదిరించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. అలాగే.. గత వారం కాలేజీ ముగిసిన తర్వాత చెన్నై నుంచి కుమ్మిడిపూండికి సబర్బన్ రైలులో వెళ్లిన దాదాపు 20 మంది విద్యార్థులు మెట్లపై గ్యాంగ్‌గా నిలబడి ఉన్నారు. ప్రయాణీకులను భయభ్రంతులకు గురించి చేశారు. ఈ విషయం రైల్వే పోలీసుల దృష్టికి రావడంతో వారిపై చర్యలు తీసుకున్నారు. వారిపై లాఠీలు ఝుళిపించారు.
