Kaushik Basu: దేశ ఆర్థిక వ్యవస్థ మూలాధారాలు పటిష్టంగా ఉన్నప్పటికీ, సమాజంలో విభజన దేశ వృద్ధిని దెబ్బతీస్తుందని ప్రపంచ బ్యాంకు మాజీ ప్రధాన ఆర్థికవేత్త కౌశిక్‌బసు ఆందోళన వ్యక్తంచేశారు. నిరుద్యోగితలో భారత్ ప్రపంచంలో నంబర్ వన్ స్థానంలో ఉన్నదని, ఏ దేశంలో లేనంతగా ఇక్కడ 24 శాతానికి పెరిగిందని తెలిపారు.
Kaushik Basu: భారత ఆర్థిక వ్యవస్థ మూలాధారాలు పటిష్టంగా ఉన్నప్పటికీ, పెరుగుతున్న విభజన, వర్గీకరణ, దేశ ఉనికికే ప్రమాదమని ప్రపంచ బ్యాంకు మాజీ ఆర్థికవేత్త కౌశిక్ బసు అన్నారు. సమాజంలో విభజన తీసుకొచ్చేలా రాజకీయాలు చేయటం, ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకోవటం వంటి చర్యలు భారత ఆర్థిక వ్యవస్థకు పెను సవాలుగా మారుతున్నాయని అన్నారు. భారతదేశానికి అతిపెద్ద సవాలు నిరుద్యోగమని కౌశిక్ బసు అన్నారు.
దేశంలో నిరుద్యోగం 24 శాతానికి చేరుకుంది, ఇది ప్రపంచంలోనే అత్యధికమని అన్నారు. ఒక దేశం యొక్క అభివృద్ధి కేవలం ఆర్థిక విధానంపై ఆధారపడి ఉండదనీ. ఒక దేశం యొక్క ఆర్థిక విజయానికి గణనీయమైన ఆధారాలు ఉంటాయని తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థ మూలాధారాలు బలంగా ఉన్నప్పటికీ, పెరుగుతున్న విభజన, వర్గీకరణలు దేశ వృద్ధిని దెబ్బ తీస్తాయని కౌశిక్ బసు అన్నారు. దేశాభివృద్ధి కేవలం ఆర్థిక విధానంపై ఆధారపడి ఉండదనీ, ఒక దేశం యొక్క ఆర్థిక విజయానికి ప్రజల విశ్వాసం కూడా అత్యంత ముఖ్యమైన కారకాల్లో ఒకటని అన్నారు.
నైపుణ్యం కలిగిన కార్మికులు, అధిక పెట్టుబడి నిష్పత్తి GDP (స్థూల దేశీయోత్పత్తి) ప్రభావితం చేస్తుందనీ, భారత దేశంలో పెట్టుబడులున్నా.. నైపుణ్యం కలిగిన కార్మికుల సంఖ్య సంవత్సరాలుగా తగ్గుతోందని అన్నారు. అధిక ద్రవ్యోల్బణంపై బసు స్పందిస్తూ.. భారతదేశంలో ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండటానికి కారణం ప్రపంచమేనని అన్నారు. కోవిడ్-19 మహమ్మారి, ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా సరఫరా వ్యవస్థ పరిమితుల ఫలితంగా ఇది ఏర్పడిందని అన్నారు. అయితే, ద్రవ్యోల్బణానికి కారణం భారతదేశ నియంత్రణకు మించినది. కానీ, ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. ప్రభుత్వాలు పేద, మధ్య తరగతి ప్రజలను రక్షించడానికి తగినన్నీ చర్యలు తీసుకోకపోవడం లేదనీ ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం ఎనిమిదేళ్ల గరిష్ఠ స్థాయి 7.8 శాతానికి పెరిగినప్పటికీ, టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 15.08 శాతంగా ఉందని ప్రస్తుతం అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్ బసు చెప్పారు. గత 24 ఏళ్లలో ఇంత అధిక టోకు ద్రవ్యోల్బణాన్ని చూడలేదనీ.. ఇప్పుడు దేశంలో కొనసాగుతోందని, 1990ల చివరి నాటి పరిస్థితులు కనిపిస్తోన్నాయని అన్నారు. ఆ సమయంలో తూర్పు ఆసియా సంక్షోభం భారతదేశంపై ప్రభావం చూపిందని అన్నారు. గత 13 నెలలుగా టోకు ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయిలోనే ఉందని, ఇది ఆర్జిక పతానానికి సంకేతమని, అంటే గతేడాది నుంచి నిత్యం ధరలు పెరుగుతున్నాయని అన్నారు.
తూర్పు ఆసియా సంక్షోభం నుంచి భారత్ నేర్చుకున్న పాఠాలను మరిచిపోకూడదని అన్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం టోకు ద్రవ్యోల్బణంలాగా పెరగవచ్చు లేదా తగ్గవచ్చునని అన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలసీ రేటు పెంపును ఆలస్యం చేసిందా అని అడిగిన ప్రశ్నకు, RBI విధానం ఎక్కువగా రిటైల్ ద్రవ్యోల్బణంపై దృష్టి సారించిందని అన్నారు. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 2 శాతం నుంచి 6 శాతం మధ్యలో ఉంచే బాధ్యతను రిజర్వు బ్యాంకుకు అప్పగించడం గమనార్హం.
ఆర్‌బిఐ పాలసీ రేటు కఠినతరం చేయడం వల్ల ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుందా అని అడిగిన ప్రశ్నకు బసు, అటువంటి చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అయితే.. ఆర్‌బిఐ కాకుండా ఇతర వ్యాపార సంస్థ విధానపరమైన చర్యలు కూడా తీసుకోవాలనీ, సరఫరా వ్యవస్థకు అంతరాయం ఉన్న చోట జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందనీ దానిని మెరుగుపరచాల్సిన అవసరం వచ్చిందని అన్నారు. ఉత్పత్తి వ్యయం పెరగడం వల్ల తీవ్రంగా నష్టపోయిన చిరు వ్యాపారులు, కార్మికులు, రైతులకు నేరుగా సహాయం అందించాల్సిన అవసరం ఉందని బసు అన్నారు.
