బాబోయ్.. ఏటీఎంలో డబ్బులకు బదులు విషపూరిత పాము పిల్లలు.. ఎక్కడంటే...

ఏటిఎం నుంచి డబ్బులు డ్రా చేసుకోవడానికి వెళ్లిన వ్యక్తి భయంతో పరుగులు పెట్టాడు. కారణం ఏంటంటే.. డబ్బులకు బదులు అందులోనుంచి పాము పిల్లలు వచ్చాయి. 

 

Poisonous baby snakes instead of money in ATM In Uttarakhand - bsb

ఉత్తరాఖండ్ : ఉత్తరాఖండ్లోని నైనిటాల్ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. డబ్బుల కోసం ఏటీఎంకి వెళితే నోట్లకి బదులు పాము పిల్లలు వచ్చాయి. దీంతో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీనికి సంబంధించి వివరాలకు వెళితే,,  బుధవారం నాడు ఓ వ్యక్తి. నైట్ ఆల్ జిల్లాలోని రాంనగర్ కోసి రోడ్డులో ఉన్న ఎస్బిఐ ఏటీఎంకు డబ్బుల కోసం వెళ్ళాడు. 

 తన ఏటీఎం కార్డు పెట్టి డబ్బులను విత్ డ్రా ప్రాసెస్ పూర్తి చేశాడు. తర్వాత డబ్బుల కోసం ఎదురు చూస్తుండగా..  ఏటీఎం మెషిన్ లో నుంచి డబ్బులకు బదులు ఒక పాము పిల్ల బయటకి వచ్చింది. దీంతో షాక్ అయిన అతడు వెంటనే ఏటీఎం రూంలో నుంచి బయటకు పరిగెత్తుకొచ్చాడు. ఏటీఎం సెక్యూరిటీ గార్డుకు విషయం చెప్పాడు. అతను వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాడు.

చాక్లెట్లు, డబ్బు ఆశచూపి.. ఏడేళ్లలో 30 మంది చిన్నారులపై అత్యాచారం, హత్య.. నిందితుడికి జీవితఖైదు..

వారు సేవ్ ది స్నేక్ అండ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు చంద్రసేన్ కశ్యప్ కు కూడా ఈ సమాచారం ఇచ్చారు. వారంతా  హుటాహుటిన  ఏటీఎం దగ్గరికి చేరుకున్నారు. బ్యాంకు అధికారులు ఏటీఎంను తెరిచారు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి వచ్చిన వారంతా షాక్ అయ్యారు. ఏటీఎం మెషిన్ లో ఏకంగా 10 పాము పిల్లలు ఉన్నాయి.సేవ్ ది స్నేక్ అండ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు చంద్రసేన్  ఈ పాము పిల్లలు అన్నింటిని జాగ్రత్తగా పట్టుకుని ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేశారు.

ఇవి విషపూరిత పాములని చంద్రసేన్  తెలిపారు. పట్టుకున్న పాములన్నింటిని సమీపంలోని అడవిలో సురక్షితంగా చంద్రసేన్  విడిచిపెట్టారు. ఈ ఘటన నేపథ్యంలో ఏటీఎంను తాత్కాలికంగా మూసివేసినట్టు అధికారులు తెలిపారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios