- Home
- National
- చాక్లెట్లు, డబ్బు ఆశచూపి.. ఏడేళ్లలో 30 మంది చిన్నారులపై అత్యాచారం, హత్య.. నిందితుడికి జీవితఖైదు..
చాక్లెట్లు, డబ్బు ఆశచూపి.. ఏడేళ్లలో 30 మంది చిన్నారులపై అత్యాచారం, హత్య.. నిందితుడికి జీవితఖైదు..
చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడి.. ఆ తరువాత హత్య చేస్తున్న నిందితుడికి ఢిల్లీ కోర్టు జీవిత ఖైదు విధించింది. దాదాపు ఇలాంటి 30 కేసుల్లో అతను నిందితుడిగా ఉన్నాడు.

న్యూఢిల్లీ : ముప్పై మంది పిల్లలను కిడ్నాప్ చేసి, లైంగికంగా వేధించి, ఆపై హత్య చేసిన నిందితుడికి ఢిల్లీ కోర్టు ఈ రోజు జీవిత ఖైదు విధించింది. మే 6న, రోహిణిలోని కోర్టు రవీందర్ కుమార్‌ను ఆరేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి, లైంగికంగా వేధించి, హత్య చేసిన కేసులో దోషిగా నిర్ధారించింది. గత వారం శిక్ష ఖరారు చేయాల్సి ఉండగా, కుమార్ ఆదాయం, ఆస్తులపై కోర్టుకు నివేదిక అందకపోవడంతో వాయిదా పడింది.
కుమార్, 2008 - 2015 మధ్య 30 మంది పిల్లలను లైంగికంగా వేధించి, హత్య చేశాడని ఆరోపణలు ఉన్నాయి. అతన్ని 2015లో ఔటర్ ఢిల్లీ ప్రాంతంలో అరెస్టు చేశారు. బేగంపూర్ పోలీస్ స్టేషన్‌లో అతని మీద కేసు నమోదైంది. శిక్షపై వాదనల సందర్భంగా ఢిల్లీ పోలీసులు దోషికి గరిష్టంగా శిక్ష విధించాలని కోరారు.
ఉత్తరప్రదేశ్‌లోని కస్‌గంజ్‌కు చెందిన కుమార్ 18 ఏళ్ల వయసులో 2008లో ఢిల్లీకి వచ్చాడు. అతను పోర్న్,డ్రగ్స్‌కు బానిసైనట్లు దర్యాప్తులో తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అతను రోజంతా పని చేస్తూ ఒక గుడిసెలో ఉండేవాడు.
డ్రగ్స్ తీసుకున్న తర్వాత పిల్లల కోసం వెతుకుతాడని, ఈ వెతుకులాటలో కొన్నిసార్లు 40 కిలోమీటర్లు నడిచేవాడని పోలీసులు కోర్టుకు తెలిపారు. తన లక్ష్యం చేరుకోవడానికి.. నిర్మాణ స్థలాలు, మురికివాడలకు ఎంచుకునేవాడు. అక్కడ నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలను ఎవరికీ అనుమానం రాకుండా ఎత్తుకెళ్లేవాడు. దీనికోసం అక్కడక్కడే తిరిగేవాడని పోలీసులు తెలిపారు.
ఆ పిల్లలకు 10 రూపాయల నోట్లు లేదా చాక్లెట్లు చూపించి ఎర వేసేవాడు. ఆ తర్వాత అతను పిల్లలను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లేవాడు. ఆతరువాత హత్య చేయడానికి ముందు వారిని లైంగికంగా హింసించేవాడని పోలీసులు కోర్టుకు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ సందర్భంలో కుమార్ ఓ చిన్నారిని సెప్టిక్ ట్యాంక్‌లో పడేశాడు. ఈ కేసులు వెలుగులోకి రావడంతో కుమార్ ను అరెస్ట్ చేయడానికి పోలీసులు వెతుకులాట మొదలుపెట్టారు. అతని జాడ కోసం పోలీసులు రోజుల తరబడి సీసీ ఫుటేజీని స్కాన్ చేసిన తర్వాత చివరికి 2015 లో రోహిణిలోని బస్టాండ్ లో అరెస్టు చేశారు.
రవీందర్ 2008లో కేరళకు చెందిన ఆరేళ్ల బాలికను కిడ్నాప్ చేసి, ఆపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ కేసులో అతడిని అరెస్టు కాలేదు. అతను తర్వాత ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని పిల్లలను టార్గెట్ చేశాడని పోలీసులు తెలిపారు.