లండన్‌లో కాదు.. బ్రస్సెల్స్‌లో..

PNB scam: Nirav Modi Flees from Britain to Brussels
Highlights

లండన్‌లో కాదు.. బ్రస్సెల్స్‌లో.. 

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు రూ.13 వేల కోట్ల మేర ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయాడు నీరవ్ మోడీ.. కుంభకోణం విషయం వెలుగు చూడటానికి ముందే పెట్టే, బేడ సర్దుకుని భారత  సరిహద్దులు దాటేశాడు మోడీ.. అయితే అతను ఎక్కడ ఉన్నది మాత్రం దర్యాప్తు సంస్థలకు అంతు చిక్కడం లేదు. కానీ బ్రిటన్‌లో ఉన్నాడని.. రాజకీయ ఆశ్రయం కోసం సంప్రదింపులు జరుపుతున్నాడని మీడియాలో కథనాలు వచ్చాయి.

దీనిపై భారత ప్రభుత్వం బ్రిటన్‌ను ఆరా తీయగా... తమ వద్ద ఉన్న ఆర్థిక నేరగాళ్లను అప్పగించాలంటే బ్రిటన్‌లో అక్రమంగా ఉన్న వలసదారులను పంపడంలో సాయం చేయాలని షరతు పెట్టింది. దీనిపై భారత్ నిర్ణయం తీసుకునే లోపు.. తాజాగా నీరవ్ బ్రిటన్‌ నుంచి పారిపోయి బ్రస్సెల్స్ లో తలదాచుకున్నట్లు తెలుస్తోంది. సింగపూర్ పాస్‌పోర్ట్‌పై ప్రయాణిస్తున్న నీరవ్.. బ్రస్సెల్స్‌లో ఉన్నట్లు బ్రిటీష్ మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది.  ఈ వార్తల ఆధారంగా సీబీఐ ఇంటర్‌పోల్ సాయంతో బ్రస్సెల్ పోలీసులను సంప్రదిస్తోంది.

loader