Asianet News TeluguAsianet News Telugu

నేడు కెనడా ప్రతినిధులతో పెట్టుబడులపై మోడీ కీలక ఉపన్యాసం

 ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  ఇండియాలో పెట్టుబడులపై కెనడా కు చెందిన ప్రతినిదులతో గురువారం నాడు ప్రసంగించనున్నారు. ఇవాళ సాయంత్రం ఆరున్నర గంటలకు ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తారని అధికారులు ప్రకటించారు.

PM to deliver keynote address at Invest India Conference in Canada lns
Author
New Delhi, First Published Oct 8, 2020, 12:09 PM IST

న్యూఢిల్లీ:  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  ఇండియాలో పెట్టుబడులపై కెనడా కు చెందిన ప్రతినిదులతో గురువారం నాడు ప్రసంగించనున్నారు. ఇవాళ సాయంత్రం ఆరున్నర గంటలకు ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తారని అధికారులు ప్రకటించారు.

కెనడాకు చెందిన వ్యాపారులు ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి భారత్ మంచి అవకాశాలను కల్పిస్తోందని  చెప్పడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యంగా చెబుతున్నారు.

ఈ సమావేశంలో బ్యాంకులు, భీమా కంపెనీలు, ఇన్వెస్ట్ మెంట్ ఫండ్స్, ఏవియేషన్, ఎలక్ట్రానిక్స్ , మాన్యుఫ్యాక్చరింగ్ కన్సల్టెంట్ సంస్థలు, విశ్వవిద్యాలయాలకు చెందిన పలువురు ప్రతినిధులు పాల్గొంటారు.

దేశంలో పెట్టుబడులు పెట్టాలని పలు  దేశాలకు చెందిన వ్యాపారులతో మోడీ సమావేశాలు నిర్వహించారు. పెట్టుబడులకు భారత్ ఏ రకంగా అనువైందో ఆయన వివరించారు. కరోనా కు ముందు పలు దేశాల్లో పర్యటించిన మోడీ దేశంలో పెట్టుబడులు పెట్టాలని ఆయా దేశాలను కోరారు. అంతేకాదు ఆయా దేశాలతో ఆయన పలు ఒప్పందాలు చేసుకొన్నారు.

కరోనా నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా  వ్యాపారాలు కూడ మందకొడిగా సాగుతున్నాయి. కరోనాకు వ్యాక్సిన్ రావడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉన్నందున..జాగ్రత్తలు తీసుకొంటూ చాలా దేశాల్లో వ్యాపార కార్యక్రమాలను ప్రారంభించిన విషయం తెలిసిందే.
 

Follow Us:
Download App:
  • android
  • ios