Asianet News TeluguAsianet News Telugu

New Parliament: నేడే నూతన పార్లమెంట్ భవనంలో తొలి సమావేశం.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీ

New Parliament: నూతన పార్లమెంటు భవనంలో సమావేశాలు నేటీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత రాజ్యాంగం యొక్క కాపీని పాత పార్లమెంటు భవనం నుండి కొత్త భవనానికి తీసుకువెళతారని వర్గాలు తెలిపాయి. ఈ ప్రక్రియలో పార్లమెంటు సభ్యులు కాలినడకన ప్రధానిని అనుసరిస్తారని వారు తెలిపారు.

PM to carry Constitution copy from old to new Parliament, MPs to follow KRJ
Author
First Published Sep 19, 2023, 3:47 AM IST | Last Updated Sep 19, 2023, 3:47 AM IST

New Parliament:  నూతన పార్లమెంటు భవనంలో ప్రత్యేక సమావేశాల ప్రారంభోత్సవం కోసం యావత్తు భారతం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తోంది. ఆ అత్రుతగా వేచి చూసిన సమయం రానే వచ్చంది. నూతన పార్లమెంటు భవనంలో సమావేశాలు నేటీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్బంగా పార్లమెంట్ ఔన్నత్యాన్ని మరింత పెంచేలా ప్రధాని మోడీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. తొలి సమావేశాల సందర్భంగా నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత రాజ్యాంగం  ప్రతీ (కాపీ)ని పాత పార్లమెంటు భవనం నుండి కొత్త భవనానికి తీసుకువెళతారని వర్గాలు తెలిపాయి. ఈ ప్రక్రియలో పార్లమెంటు సభ్యులు కాలినడకన ప్రధానిని అనుసరించనున్నారు.  

ఈ ఏడాది మే 28న ప్రధాని మోదీ ప్రారంభించిన కొత్త పార్లమెంట్ కాంప్లెక్స్‌లో నేటీ నుంచి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరుగనున్నాయి. ప్రారంభానికి ముందు.. పాత పార్లమెంట్ కాంప్లెక్స్ వెలుపల ఉదయం 9:30 గంటలకు ఫోటో సెషన్ ఉంటుంది. 1927 జనవరి 18న అప్పటి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ చేత ప్రారంభించబడిన పాత పార్లమెంట్ భవనం చారిత్రక వారసత్వంపై దృష్టి సారించే ప్రత్యేక సమావేశం ఉదయం 11 గంటలకు జరుగుతుంది. అంతేకాకుండా 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతామని ప్రతిజ్ఞ చేయనున్నారు.
 
ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖర్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, అధిర్ రంజన్ చౌదరి, బీజేపీ నాయకురాలు మేనకా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 12:35 గంటలకు సాగుతుంది. 

ఈ  సమావేశం అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాత పార్లమెంటు నుంచి కొత్త పార్లమెంట్‌కు మారనున్నారు. అలాగే.. ఈ  ప్రధాని మోదీ రాజ్యాంగ ప్రతిని తీసుకుని పాత పార్లమెంట్ భవనం నుంచి కొత్త పార్లమెంట్ భవనం వరకు కాలినడకన వెళ్లనున్నారు. ఇది మాత్రమే కాదు.. పాత పార్లమెంట్ హౌస్ నుండి కొత్త పార్లమెంట్ హౌస్‌కి వెళ్లే సమయంలో ఎంపీలందరూ కాలినడకన ప్రధాని మోదీని అనుసరించనున్నట్టు తెలుస్తోంది. అంతకుముందు కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ సెంగోల్‌ను అమర్చిన విషయం తెలిసిందే.. 


కొత్త పార్లమెంటు భవనంలో మధ్యాహ్నం 1:15 గంటలకు లోక్‌సభ కార్యకలాపాలు ప్రారంభం కానుండగా.. రాజ్యసభ మధ్యాహ్నం 2:15 గంటలకు ఎగువ సభ ఛాంబర్‌లో సమావేశమవుతుంది. కొత్త పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించిన తర్వాత ఓం బిర్లా, ప్రధాని మోదీ, అధిర్ రంజన్ చౌదరి సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. దీని తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాత పార్లమెంటు నుంచి కొత్త పార్లమెంట్‌కు మారనున్నారు. నేటీ నుంచి కొత్త భవనంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనుండగా నూతన పార్లమెంట్‌లో మొదటి రోజున ఎంపీలందరికీ ప్రత్యేక గిఫ్ట్ బ్యాగ్ ఇవ్వబడుతుంది. ఈ బ్యాగ్‌లో భారత రాజ్యాంగం కాపీ, స్మారక నాణేలు,  స్టాంపులు, కొత్త పార్లమెంట్‌పై బుక్‌లెట్ లను అందించనున్నారు.  

 మొదటి రోజు ఏం జరిగింది?

అంతకుముందు పార్లమెంట్ సమావేశాల మొదటి రోజు ప్రధానితో సహా పలువురు నాయకులు చారిత్రక క్షణాలను గుర్తు చేసుకున్నారు. తొలిరోజు 75 ఏళ్ల పార్లమెంట్‌ ప్రయాణంపై లోక్‌సభ, రాజ్యసభల్లో చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాజ్యాంగ పరిషత్ నుంచి నేటి వరకు జరిగిన పార్లమెంటరీ యాత్రపై చర్చ జరిగింది. అనంతరం సాయంత్రం మంత్రివర్గ సమావేశం కూడా జరిగింది. ఐదు రోజుల పాటు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో అనేక కీలక నిర్ణయాలు తీసుకోవచ్చని చెబుతున్నారు. అయితే, సెషన్‌లో జాబితా చేయబడిన అజెండాలోని ప్రధాన అంశాలలో ఒకటి రాజ్యాంగ సభతో ప్రారంభమైన పార్లమెంటు 75 ఏళ్ల ప్రయాణంపై ప్రత్యేక చర్చ జరిగింది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios