Asianet News TeluguAsianet News Telugu

రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్ ప్రారంభం: ఫేస్‌బుక్‌లో ఫోటోలు షేర్ చేసిన మోడీ

వారణాసిలో రుద్రాక్ష్ పేరుతో నిర్మించిన కన్వెన్షన్ సెంటర్ ను ప్రధాని నరేంద్ర మోడీ గురువారం నాడు ప్రారంభించారు. వారణాసిలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రుద్రాక్ష్ సెంటర్ ఫోటోలను ఫేస్ బుక్ లో ఆయన  పోస్టు చేశారు. 
 

PM Shares Aerial View Of 'Rudraksh', Shiv Linga-Styled Centre In Varanasi
Author
VARANASI, First Published Jul 15, 2021, 4:20 PM IST

వారణాసి: రుద్రాక్ష్ పేరుతో పిలవబడే అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ ను ప్రధాని నరేంద్ర మోడీ గురువారం నాడు ప్రారంభించారు. ఈ కన్వెన్షన్ సెంటర్  ఈ ప్రాంతానికి చెందిన సాంస్కృతిక గొప్పతనాన్ని చూపుతోంది.తాను ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి పార్లమెంట్ నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొన్నారు. రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్  సమావేశాలకు ఆకర్షణీయంగా మారుస్తోందన్నారు. ఈ భవనానికి చెందిన ఏరియల్ షాట్లను ప్రధాని మోడీ తన ఫేస్ బుక్ ఖాతాలో  షేర్ చేశాడు.

also read:కరోనా కట్టడిలో యూపీ సర్కార్ పనితీరు అసమానమైంది: వారణాసిలో మోడీ

ఈ కన్వెన్షన్ సెంటర్ లో 108 రుద్రాక్షలు ఏర్పాటు చేశారు.  దీని పై కప్పు శివలింగాన్ని పోలి ఉంటుంది. ఎల్‌ఈడీ లైట్లను ఈ భవనంలో అమర్చారు. ఏడేళ్లుగా కాశీ ఏడేళ్లుగా అనేక అభివృద్ది కార్యక్రమాలతో అలంకరించబడిందన్నారు. రుద్రాక్ష లేకుండా ఈ అలంకారాన్ని ఎలా పూర్తి చేయవచ్చని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు కాశీ ఈ రుద్రాక్షను ధరించడంతో  కాశీ అభివృద్ది మరింత ప్రకాశిస్తోందన్నారు మోడీ.ఈ సందర్భంగా జపాన్ ప్రధానిని షింజో అబేను ఆయన గుర్తు చేసుకొన్నారు. కాశీకి షింజో వచ్చిన సమయంలో  రుద్రాక్ష్ ఆలోచన గురించి చర్చించినట్టుగా మోడీ ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టుపై పనిచేయాలని  ఆయన తన  అధికారులను ఆదేశించారని మోడీ తెలిపారు.

సిగ్రాలో  2.87 హెక్టార్ల భూమిలో రెండంతస్థుల్లో 1200 మంది కూర్చొనే సామర్ధ్యంతో ఈ భవనాన్ని నిర్మించారు.ఈ కన్వెన్షన్ సెంటర్ ద్వారా సామాజిక, సాంస్కృతిక పరస్పర చర్యలకు అవకాశాలు కల్పించడమే ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు.  పర్యాటక రంగాన్ని అభివృద్ది చేసేందుకు కూడ ఈ సెటర్ దోహదపడుతుందని అధికారులు చెప్పారు.

అంతర్జాతీయ సమావేశాలు, ప్రదర్శనలు, సంగీత కచేరీలు, ఇతర కార్యక్రమాలను నిర్వహించడానికి ఇది అనువైందని అధికారులు తెలిపారు. ఈ గ్యాలరీలో వారణాసి కళ, సంస్కృతి, సంగీతాన్ని వర్ణించే కుడ్య చిత్రాలు ఏర్పాటు చేశారు.జపాన్ సహాయంతో ఈ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించారు. అవసరమైన సమయంలో ఈ సెంటర్ చిన్న చిన్న ప్రదేశాలుగా విభజించుకొనే వెసులుబాటు కూడ ఉందని అధికారులు తెలిపారు.ఈ భవనం పర్యావరణ అనుకూలంగా నిర్మించారు. ఇక్కడ అవసరమైన భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios