జీ20 సమ్మిట్‌కు 3 రోజుల ముందు మోడీ, ఇంత టైట్ షెడ్యూల్‌లో ప్రధాని ఎలా పని చేస్తారు..?
న్యూఢిల్లీ వేదికగా జరగనున్న జీ20 సమావేశాలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ మూడు రోజుల పాటు బిజి బిజీగా గడపనున్నారు. ఇండోనేషియా టూర్‌తో పాటు ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొననున్నారు.

2014 నుంచి దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నరేంద్ర మోదీ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇప్పటికీ ఆయన నిరంతరం పని చేస్తూనే ఉన్నారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. దీన్ని అర్థం చేసుకోవాలంటే, G20 శిఖరాగ్ర సమావేశానికి ముందు మోడీ మూడు రోజుల షెడ్యూల్‌ను చూడవచ్చు. ఈ సమయంలో ఆయన ఓ ముఖ్యమైన సమావేశం నిమిత్తం ఇండోనేషియా వెళ్లనున్నారు. అక్కడ పని ముగించుకుని G20 సమ్మిట్ ప్రారంభానికి ముందే తిరిగి భారత్‌కు చేరుకుంటా. ఇది మాత్రమే కాదు.. ప్రధాని మోడీ జకార్తాకు బయలుదేరే ముందు బ్యాక్ టు బ్యాక్ మినిస్టర్స్ సమావేశాలకు కూడా హాజరయ్యారు.
ఇవాళ మధ్యాహ్నం కేంద్ర మంత్రి మండలి సమావేశాన్ని నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ.. రాత్రి 7.30 గంటలకు జకార్తాకు బయలుదేరే ముందు వరకు సమావేశాలను కొనసాగించారు. భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ 6వ తేదీ రాత్రి 8 గంటలకు జకార్తా బయలుదేరి దాదాపు 7 గంటల ప్రయాణం తర్వాత సెప్టెంబర్ 7న తెల్లవారుజామున 3 గంటలకు మోడీ జకార్తా చేరుకుంటారు.
సెప్టెంబరు 7న ఉదయం 7 గంటలకు ఆసియాన్ సదస్సులో పాల్గొంటారు. దీని తర్వాత ఉదయం 8.45 గంటలకు తూర్పు ఆసియా సదస్సుకు హాజరవుతారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లనున్నారు. ఉదయం 11.45 గంటలకు బయల్దేరి సాయంత్రం 6.45 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంటారు. దీని తర్వాత, మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ 3 దేశాలతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. వీరిలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో సమావేశం కూడా వుంది.