ప్రధాని నరేంద్ర మోడీ కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో పోస్ట్ బడ్జెట్ వెబ్‌నార్లు ఒకటి. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 11 వరకు 12 వెబ్‌నార్లలో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. 

ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి 23 నుంచి మార్చి 11 మధ్య నిర్వహించబడే 12 పోస్ట్ బడ్జెట్ వెబ్‌నార్లను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ వెబ్‌నార్లను వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు కలిసి కేంద్ర బడ్జెట్ లో ప్రస్తావించిన ‘‘సప్తరుషి’’ ప్రాధాన్యతలను వివరించనున్నాయి. ప్రధాని మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం గడిచిన దశాబ్ధకాలంగా అనేక బడ్జెట్ సంస్కరణలను ప్రవేశపెట్టింది. బడ్జెట్ తేదీని ఫిబ్రవరి 1వ తేదీకి మార్చడం ఇందులో ఒకటి. తద్వారా రుతుపవనాల ప్రారంభానికి ముందు మంత్రిత్వ శాఖలు నిధుల వినియోగానికి తగిన సమయాన్ని పొందుతాయి. ఇక బడ్జెట్ అమలులో సంస్కరణల్లో మరో కొత్త అడుగు పోస్ట్ బడ్జెట్ వెబ్‌నార్స్ ఆలోచన. 

ప్రభుత్వ ప్రైవేట్ రంగాలకు చెందిన నిపుణులు, విద్యాసంస్థలు, పరిశ్రమలు , ప్రాక్టీషనర్‌లను ఒకే వేదికపైకి తీసుకురావడానికి, రంగాల వారీగా అమలు చేసే వ్యూహాలపై సహకారంతో పనిచేయడానికి ప్రధాన మంత్రి ఈ ఆలోచనను అమల్లోకి తెచ్చారు. ఈ వెబ్‌నార్లు 2021లో జన్ భగీదారి స్ఫూర్తితో ప్రారంభించబడ్డాయి. బడ్జెట్ ప్రకటనలను సమర్థవంతంగా, శీఘ్రంగా , అతుకులు లేకుండా అమలు చేయడంలో సంబంధిత వాటాదారులందరి ప్రమేయం , యాజమాన్యాన్ని ఇవి ప్రోత్సహిస్తాయి.

ఈ వెబ్‌నార్లు.. త్రైమాసిక లక్ష్యాలతో కార్యాచరణ ప్రణాళికల తయారీకి మంత్రులు, శాఖలు, సంబంధిత వాటాదారులందరి సమన్వయ ప్రయత్నాలపై దృష్టి పెట్టాయి. తద్వారా అనుకున్న ఫలితాలను సకాలంలో సాధించడానికి వీలు కలుగుతుంది. 

వెబ్‌నార్ల షెడ్యూల్:

1. గ్రీన్ గ్రోత్ - ఫిబ్రవరి 23
2. వ్యవసాయం, సహకార రంగం - ఫిబ్రవరి 24
3. యువశక్తి, నైపుణ్యం, విద్య - ఫిబ్రవరి 25
4. రీచింగ్ ది లాస్ట్ మైల్ - ఫిబ్రవరి 27
5. సామర్ధ్యాన్ని వెలికితీయడం : జీవన విధానంలో సాంకేతికతను వినియోగించడం - ఫిబ్రవరి 28
6 . అర్బన్ డెవలప్‌మెంట్ విత్ ఫోకస్ ఆన్ ప్లానింగ్ - మార్చి 1
7. మిషన్ మోడ్‌లో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం - మార్చి 3
8. మౌలిక సదుపాయాలు , పెట్టుబడులు, పీఎం గతి శక్తి - మార్చి 4
9. ఆరోగ్యం, మెడికల్ రీసెర్చ్ - మార్చి 6
10. ఆర్ధిక రంగం - మార్చి 7
11. మహిళా సాధికారికత - మార్చి 10
12. పీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ (పీఎం వికాస్) - మార్చి 11