Asianet News TeluguAsianet News Telugu

ప్రధాని నోట మరోసారి సర్జికల్ స్ట్రైక్... రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై మాట్లాడుతూ...

ఇవాళ(సోమవారం)రాజ్య‌స‌భ‌లో రాష్ర్ట‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానంపై చ‌ర్చ సంద‌ర్భంగా మోదీ మాట్లాడారు. 

PM Narendra Modi  Speech at Rajyasabha
Author
New Delhi, First Published Feb 8, 2021, 11:12 AM IST

న్యూడిల్లీ: సర్జికల్ స్ట్రయిక్ ద్వారా భారత సామర్థ్యం మరోసారి బయటపడిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇవాళ(సోమవారం)రాజ్య‌స‌భ‌లో రాష్ర్ట‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానంపై చ‌ర్చ సంద‌ర్భంగా మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా కరోనా మహమ్మారిని భారత్ ఎలా ఎదుర్కొంది... దేశాభివ్రుద్ది ప్రస్తుతం ఎలా సాగుతోంది అన్న విషయాల గురించి ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు.  

'రాష్ట్రపతి ప్రసంగం ఈ దశాబ్దానికు మార్గదర్శకం. విపక్షాలు ఆ ప్రసంగాన్ని బహిష్కరించకుండా వుండాల్సింది. గత ఏడాది కాలంగా అనుకోని శత్రువు(కరోనా)నుండి భారత పౌరులను కాపాడుకునేందుకు విశ్వప్రయత్నం చేశాం. కొత్త ఆలోచనలతో కరోనాను సమర్థవంతంగా ఎదుర్కున్నాం.ఆ దేవుడి దయతో దేశ ప్రజలనే కాదు అంతర్జాతీయ సమాజాన్ని కూడా కాపాడే ప్రయత్నం చేశాం'' అన్నారు. 

''కరోనా వేగంగా విస్తరిస్తున్న సమయంలో ప్రపంచం మొత్తం భారత్ వైపు చూసింది.  ఈ సమయంలో కరోనా వారియర్స్ తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించారు. ఇలాంటి వారిని ప్రోత్సహించడానికి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి దేశ ప్రజలందరిని జ్యోతి ప్రజ్వలన చేయమన్నాం. దీనిపై కొందరు విమర్శలు చేశారు. దేశ సామూహిక శక్తి కోసమే ఇది చేస్తున్నామని వారు తెలుసుకోలేకపోయారు.విమర్శించడానికి ఇంకా చాలా విషయాలున్నాయి... వాటిని విమర్శించాలి. కానీ ప్రజల సంరక్షణ కోసం చేసే పనులపై కాదు'' అని అన్నారు. 

read more   సాగు చట్టాల్లో ఒక్క లోపాన్ని చూపండి: ప్రతిపక్షాలకు, రైతులకు తోమర్ సవాల్

''అతి తక్కువ సమయంలో మిషన్ మోడ్ లో పరిచేసి కరోనా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చాం.  ప్రస్తుతం భారత్ లో ప్రపంచంలో అతి పెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. భారత్ సామర్థ్యం ఇది.... ఇలా ప్రపంచం ద్రుష్టి మనవైపే వున్న సమయంలో అద్భుతాలు చేశాం. సంకట సమయంలో విదేశాలకు కూడా మందులు అందించాం. కరోనాను ఎదుర్కోడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేశాయి'' అన్నారు.

''కరోనా ఆత్మ నిర్భర్ భారత్ దిశగా బాటలు వేసింది. వోకల్ ఫర్ లోకల్ మన మంత్రంగా మారింది. భారత్ మరింత బలపడటానికి కరోనా ఉపయోగపడింది. ఇక భారత్ లో డబుల్ డిజిట్ గ్రోత్ పై అనుమానాలు వ్యక్తమయ్యాయి, అయితే ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ భారత్ దూసుకుపోతోంది. భారత్ డిజిటల్ ఆర్థిక లావాదావీలు  4లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇలా భారత్ ప్రతి విషయంలోనూ ప్రపంచంతో పోటీ పడుతోంది'' అని ప్రధాని పేర్కోన్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios