జీ 7 సమ్మిట్‌లో గ్లోబల్ సౌత్ దేశాల ఆందోళనలపై గొంతెత్తుతానన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. జపాన్‌కు బయల్దేరే ముందు ఆయన న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయంలో నిక్కీ ఆసియాతో ప్రత్యేకంగా మాట్లాడారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీ జపాన్‌లోని హిరోషిమాలో జరిగే గ్రూప్ ఆఫ్ సెవెన్ సమ్మిట్‌లో "గ్లోబల్ సౌత్ దేశాల గొంతుకగా వాటి ఆందోళనలను విస్తరింపజేస్తానని" స్పష్టం చేశారు. జీ 7 సమ్మిట్ కోసం జపాన్‌కు బయల్దేరే ముందు ఆయన న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయంలో నిక్కీ ఆసియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇంధనం, డిజిటల్ టెక్నాలజీ , సప్లై చైన్ వంటి రంగాలలో ప్రపంచంలో చోటు చేసుకుంటున్న మార్పులు , సవాళ్లను చర్చించడానికి తాను ఎదురుచూస్తున్నానని చెప్పారు. "ఈ సవాళ్లను ఎదుర్కోవడంలో నమ్మకమైన భాగస్వామిగా భారతదేశ పాత్రను తాను నొక్కిచెబుతున్నాను," అని ప్రధాని పేర్కొన్నారు. ‘‘భారతదేశ అనుభవం " ఈ సమావేశంలో బలంగా ప్రతిధ్వనిస్తుంది" అని ఆయన అన్నారు.
G-7లో సభ్యత్వం లేని భారతదేశం.. ఈఏడాది సమావేశాలను హోస్ట్ చేస్తున్న జపాన్ ప్రధాన మంత్రి ఫ్యూమియో కిషిడాచే ఆహ్వానించబడింది. గ్లోబల్ సౌత్ , అభివృద్ధి చెందుతున్న ప్రపంచం అని పిలవబడే దేశాలతో సంబంధాలను బలోపేతం చేయడానికి తన సంకల్పాన్ని పదేపదే వ్యక్తం చేశారు ప్రధాని. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, చట్టబద్ధమైన పాలన వంటి జపాన్, భారత్‌ల ఉమ్మడి విలువలు సహజంగానే తమను మరింత దగ్గర చేశాయని మోదీ అన్నారు. మా రాజకీయ, వ్యూహాత్మక, భద్రత, ఆర్థిక ప్రయోజనాలలో ఇప్పుడు పెరుగుతున్న కలయికను తాము చూస్తున్నాము అని ప్రధాని ఇంటర్వ్యూలో చెప్పారు.
అయితే హిరోషిమాలో జరిగే సదస్సులో భారత్‌కు కొన్ని ప్రతికూలతలు వున్నాయ్నారు మోడీ. ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకు దీర్ఘకాల సైనిక భాగస్వామిగా వున్న రష్యాను భారతదేశం స్పష్టంగా ఖండించలేదు . మాస్కోపై ఆంక్షలను మరింత కఠినతరం చేసే లక్ష్యంతో ఉన్న G-7 .. ప్రజాస్వామ్య దేశాలపై దృష్టి పెట్టింది. మోదీ పదేపదే శాంతి కోసం పిలుపునిస్తూ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో "నేటి యుగం యుద్ధ యుగం కాదు" అని మాత్రమే సూచిస్తూ.. భారతదేశం రష్యాతో చురుకైన వ్యాపారాన్ని కొనసాగిస్తోంది.
ఈ క్రమంలోనే ఉక్రెయిన్ వివాదంలో భారతదేశం మధ్యవర్తి పాత్ర పోషించగలదా అని అడిగిన ప్రశ్నకు.. ఉక్రెయిన్ వివాదంపై భారత్ వున్న స్థానం "స్పష్టం, తిరుగులేనిది" అని మోడీ అన్నారు. భారతదేశం శాంతి పక్షాన నిలుస్తుందని.. వారి ప్రాథమిక అవసరాలను తీర్చడంలో సవాళ్లను ఎదుర్కొనే వారికి మద్దతు ఇవ్వడానికి మేము కట్టుబడి ఉన్నామని మోడీ స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆహారం, ఇంధనం , ఎరువుల ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో తాము రెండింటితో కమ్యూనికేషన్‌ను కొనసాగిస్తామన్నారు. అంతే రష్యా, ఉక్రెయిన్ అని అర్ధమని ప్రధాని పేర్కొన్నారు.
అయితే G-7 దేశాలు భారతదేశాన్ని తమ వైపుకు లాగాలని భావిస్తున్నాయి.ఎందుకంటే వారు నియమాల ఆధారిత అంతర్జాతీయ క్రమం అని తరచుగా వివరించే వాటిని మరింత సుస్ధిరం చేయాలని చూస్తున్నారు. కానీ భారతదేశం చాలాకాలంగా సులభమైన భౌగోళిక రాజకీయ వర్గీకరణను ధిక్కరించింది. భారత్ ప్రస్తుతం అమెరికా, జపాన్ , ఆస్ట్రేలియాలు సభ్యులుగా వున్న క్వాడ్‌లో సభ్యు దేశం. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తన ఆసియా పర్యటనను తగ్గించుకుంటున్నట్లు చెప్పడానికి ముందు వచ్చే వారం సిడ్నీలో సమావేశం కావాల్సిన క్వాడ్.. హిరోషిమాలో తన సొంత శిఖరాగ్ర సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తోందని భారత విదేశాంగ కార్యదర్శి గురువారం తెలిపారు.
వచ్చే నెలలో మోడీ భారత్‌కు "ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామి" అని పిలిచే యుఎస్‌కు వెళ్లనున్నారు. చైనా , రష్యా నేతృత్వంలోని షాంఘై సహకార సంస్థ (SCO)లోనూ భారతదేశం సభ్యదేశంగా ఉంది. న్యూఢిల్లీ ఎప్పుడూ భద్రతాపరమైన పొత్తులతో పెళ్లి చేసుకోలేదని మోదీ ఉద్ఘాటించారు. "బదులుగా, తాము తమ జాతీయ ఆసక్తుల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా విస్తృత శ్రేణి స్నేహితులు , సమాన ఆలోచనలు కలిగిన భాగస్వాములతో పనిచేస్తూ ఉంటామని ప్రధాని చెప్పారు.
క్వాడ్ దేశాల సమిష్టి దృష్టి స్వేచ్ఛ, బహిరంగ, సుసంపన్నమైన , సమ్మిళిత ఇండో - పసిఫిక్ ప్రాంతాన్ని పెంపొందించడంపై ఉంది. మరోవైపు ముఖ్యమైన మధ్య ఆసియా ప్రాంతంతో భారతదేశం ఎంగేజ్ కావడంలో SCO ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ రెండు సమూహాలలో పాల్గొనడం భారతదేశానికి విరుద్దమో, పరస్పర విరుద్ధమో కాదు. గ్లోబల్ సౌత్‌లో సభ్యునిగా, విభిన్న స్వరాల మధ్య వారధిగా పనిచేయడం, నిర్మాణాత్మక, సానుకూల ఎజెండాకు దోహదపడటంపైనా మా ఆసక్తి అని ప్రధాని చెప్పారు.
డిసెంబర్‌లో ఇండోనేషియా నుంచి జి-20 అధ్యక్ష పదవిని భారత్ చేపట్టింది. ఆ తర్వాత జనవరిలో భారత్ 125 దేశాలను ఆకర్షిస్తూ ఆన్‌లైన్‌లో వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్‌ను ప్రారంభించింది. భద్రతా మండలిలో శాశ్వత స్థానం కోసం భారతదేశం బిడ్‌తో సహా ఐక్యరాజ్యసమితి సంస్కరణల సమస్యపై ప్రపంచ పాలనా సంస్థల "పరిమితులు" గురించి మోడీ మాట్లాడారు.
వాతావరణ మార్పు, కోవిడ్-19 మహమ్మారి, తీవ్రవాదం, ఆర్థిక సంక్షోభాలు వంటి సమకాలీన సవాళ్లను పరిష్కరించడంలో ఈ లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. యుఎన్ భద్రతా మండలి విశ్వసనీయత , దాని నిర్ణయాత్మక ప్రక్రియ ఎల్లప్పుడూ ప్రశ్నార్థకమవుతోందని ప్రధాని మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యానికి, అలాగే ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి మొత్తం ఖండాలకు శాశ్వత ప్రాతిపదికన ప్రాతినిధ్యాన్ని నిరాకరిస్తూనే ఉందని మోడీ స్పష్టం చేశారు. జపాన్ సారథ్యంలోని G-7.. ఆ ఖండాలకు చేరుకోవడం, ఆఫ్రికన్ యూనియన్ ఈ ఏడాది చైర్‌గా ఉన్న బ్రెజిల్, కొమొరోస్‌లను ఆహ్వానించడం ప్రారంభించిందని చెప్పారు.
అదే సమయంలో, మోడీ తన సన్నిహిత పొరుగు దేశాలైన చైనా , పాకిస్తాన్‌లతో భారతదేశానికి ఉన్న సంబంధాలను కూడా స్పృశించారు. భారతదేశం తన సార్వభౌమత్వాన్ని, గౌరవాన్ని కాపాడుకోవడానికి పూర్తిగా సిద్ధంగా ఉంది అని చైనాతో కొనసాగుతున్న సరిహద్దు ప్రతిష్టంభన గురించి మోడీ స్పష్టం చేశారు. సార్వభౌమాధికారం, చట్టబద్ధత, వివాదాల శాంతియుత పరిష్కారం పట్ల న్యూఢిల్లీ విధానాన్ని మోడీ పునరుద్ఘాటించారు.
భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలు ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీశాయి. ముఖ్యంగా 2020లో జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ జవాన్లు, నలుగురు చైనా సైనికులు మరణించారు . దశాబ్దాల తర్వాత భారత్ -చైనాల మధ్య జరిగిన మొదటి ఘోరమైన యుద్ధం ఇదే. చైనాతో సాధారణ ద్వైపాక్షిక సంబంధాలకు సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతత చాలా అవసరం అని మోదీ అన్నారు. భారత్-చైనా సంబంధాల భవిష్యత్ అనేది.. అభివృద్ధి, పరస్పర గౌరవం, పరస్పర సున్నితత్వం, పరస్పర ప్రయోజనాలపైనే ఆధారపడి ఉంటుంది అని మోదీ పేర్కొన్నారు.
ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే.. 1947లో విభజన నుండి భారతదేశం సాధారణ , పొరుగు సంబంధాలను కోరుకుంటుందని మోడీ అన్నారు. అయితే, తీవ్రవాదం , శత్రుత్వం లేని అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం వారి బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ విషయంలో అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పాకిస్థాన్‌పై ఉందని ఆయన తేల్చిచెప్పారు.
మోడీ అంతర్జాతీయ దౌత్యాన్ని పెంచుకుంటూ పోతున్న నేపథ్యంలో వచ్చే ఏడాది భారత్‌లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై కూడా ఆయన ఓ కన్నేసి ఉంచారు. మోడీ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ వరుసగా మూడవసారి అధికారం కోసం ప్రయత్నిస్తోంది. మోడీ మరోసారి విజయం వైపు దూసుకుపోతారని భావిస్తున్నారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా ఉందని ప్రధాని పేర్కొన్నారు.
2014లో పదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వున్న భారత్.. ఇప్పుడు ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగినందున మన పురోగతి స్పష్టంగా కనిపిస్తోందని మోడీ చెప్పారు. గ్లోబల్ హెడ్‌విండ్‌లు వృద్ధికి సవాళ్లు విసురుతున్న మాట వాస్తవమే అయినప్పటికీ, ఇటీవలి కాలంలో బలమైన పునాదిని నిర్మించుకున్నామని ఆయన తెలిపారు. ఇది కొన్నేళ్ల పాటు మాకు అనుకూలంగా ఉంటుందని మోడీ తెలిపారు. మరో పాతికేళ్లలో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు పూర్తవుతాయని.. ఈ క్రమంలో వచ్చే 25 ఏళ్లలోపు దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు.
