Asianet News TeluguAsianet News Telugu

రిషబ్ పంత్ తల్లికి ప్రధాని మోదీ ఫోన్.. క్రికెటర్ ఆరోగ్యంపై ఆరా..

భారత క్రికెట్ స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురయ్యాడు. రూర్కీ సమీపంలో ఆయన కారు డివైడర్‌ను ఢీకొని మంటలు చెలరేగాయి. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స కొనసాగిస్తున్నారు. ఈ తరుణంలో క్రికెటర్ రిషబ్ పంత్ తల్లితో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. పంత్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.

PM Narendra Modi speaks to Rishabh Pant's mother
Author
First Published Dec 30, 2022, 11:56 PM IST

టీమిండియా స్టార్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు.  ఈ ప్రమాదంలో రిషబ్ పంత్ తలకు, మోకాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ తరుణంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్రికెటర్ రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. రిషబ్ పంత్ తల్లికి ఫోన్ చేసి.. అతడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం పంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. 

అంతకుముందు భారత క్రికెటర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ పంత్ గురించి ప్రధాని మోడీ  ట్వీట్ చేశారు. సుప్రసిద్ధ క్రికెటర్ రిషబ్ పంత్‌ కు  జరిగిన ప్రమాద ఘటనతో నేను బాధపడ్డాను.నేను అతని  ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నాను. అని ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే రిషబ్ పంత్‌పై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. క్రికెట్ అభిమానులు రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి కూడా ఈరోజు మరణించడం గమనార్హం. ఇలాంటి క్లిష్ట సమయంలో.. ప్రధాని మోడీ కూడా అతని కార్యక్రమాలకు హాజరయ్యారు.  

రిషబ్ పంత్ కి యాక్సిడెంట్ 

టీమిండియా స్టార్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ కారు శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో రిషబ్ పంత్ తలకు, మోకాలికి తీవ్ర గాయాలయ్యాయి. అంతే కాకుండా వెన్ను, కాళ్లలో కొన్ని భాగాల్లో గాయాలయ్యాయి. రూర్కీ సమీపంలోని మహ్మద్‌పూర్ జాట్ ప్రాంతంలో పంత్ ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం తర్వాత రిషబ్ పంత్ కారులో మంటలు చెలరేగాయి. ఈ సమయంలో ఓ బస్సు డ్రైవర్ దూతగా మారి రిషబ్ పంత్ జీవితాన్ని కాపాడాడు. ఆ డ్రైవర్ బస్సును ఆపి రిషబ్ పంత్‌ను కారులో నుంచి తీసుకెళ్లాడు. అనంతరం అతడిని ఆస్పత్రికి తరలించారు.రిషబ్ పంత్ తన సొంత కారులో తన సొంత పట్టణం రూర్కీకి వెళ్తున్నాడు. ఈ క్రమంలో అతను కారుపై అదుపుతప్పి.. డివైడర్‌ను ఢీ కొన్నాడు. 

బీసీసీఐ ఆందోళన .. మెదడు, వెన్నెముకకు ఎంఆర్ఐ

రిషబ్ పంత్ కుడి మోకాలి లిగమెంట్ పగిలిపోవడంతో భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) ఆందోళన చెందుతోంది. మీడియా కథనాల ప్రకారం.. డెహ్రాడూన్‌లో పంత్‌కు చికిత్స చేస్తున్న వైద్యులతో బిసిసిఐ వైద్యుల ప్యానెల్ సమావేశం నిర్వహించింది. అతని లిగమెంట్‌కు బిసిసిఐ వైద్య బృందం చికిత్స చేయాలని నిర్ణయించింది. దీని కోసం పంత్ విదేశాలకు పంపవచ్చని తెలుస్తుంది. 
ESPNcricinfo ప్రకారం.. రిషబ్ పంత్ మెదడు , వెన్నెముక యొక్క MRI ఫలితాలు సాధారణంగా ఉన్నాయి. శుక్రవారం ఉదయం ఉత్తరాఖండ్‌లోని రూర్కీ సమీపంలో జరిగిన ఘోర కారు ప్రమాదంలో పంత్ ముఖానికి అయినా గాయాలను సరిచేయడానికి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేసారు. నొప్పి, వాపు కారణంగా.. అతని చీలమండ , మోకాలికి MRI స్కానింగ్ శనివారానికి వాయిదా పడింది.  పంత్‌ను డెహ్రాడూన్‌లోని మాక్స్ ఆసుపత్రిలో చేర్పించారు. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios