Tejas: ప్రధాని మోడీ ప్రయాణించాడుగా.. తేజస్ జెట్ క్రాష్ అవుతుంది: టీఎంసీ ఎంపీ షాకింగ్ కామెంట్.. బీజేపీ ఫైర్

ప్రధాని మోడీ ప్రయాణించాడు కాబట్టి తేజస్ ఫైటర్ జెట్ కూడా త్వరలోనే క్రాష్ అవుతుందని టీఎంసీ ఎంపీ శాంతాను సేన్ షాకింగ్ కామెంట్ చేశాడు. ఆయన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు హాజరయ్యాడు కాబట్టే ఇండియా ఓడిపోయిందని అన్నాడు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. వెంటనే టీఎంసీ ఆయనను పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసింది.
 

pm narendra modi sortied Tejas fighter jet would get crashed TMC MP shantanu sen controversial comment bjp fired back kms

న్యూఢిల్లీ: తృణమూలో  కాంగ్రెస్ ఎంపీ శాంతాను సేన్ షాకింగ్ కామెంట్ చేశాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రయాణించాడు కాబట్టి, తేజస్ యుద్ధ విమానం కూడా క్రాష్ అవుతుందని అన్నాడు. వరల్డ్ కప్, కంగనా రనౌత్ సినిమా మొదలు తేజస్ యుద్ధ విమానం వరకూ పేర్కొంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై టీఎంసీ ఎంపీ అనుచిత వ్యాఖ్యలు చేశారు.

కంగనా రనౌత్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కావడానికి ప్రధాని మోడీ కారణం అని టీఎంసీ ఎంపీ శాంతాను సేన్ పేర్కొన్నాడు. మూడు సంవత్సరాలుగా విరాట్ కోహ్లీ సెంచరీ చేయడం లేదని ప్రధాని మోడీని నిందించాడు. గుజరాత్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోవడానికి అక్కడికి ప్రధాని మోడీ వెళ్లడమే కారణం అనీ అన్నాడు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవలే భారత ప్రభుత్వ రంగంలోని హెచ్ఏఎల్ తయారు చేసిన భారత వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానం తేజస్ జెట్‌లో ప్రయాణించిన సంగతి తెలిసిందే. దీనిపైనా టీఎంసీ ఎంపీ షాకింగ్ కామెంట్ చేశాడు. ప్రధాని మోడీ తేజస్ జెట్‌లో ప్రయాణించాడు కాబట్టి, తేజస్ జెట్ కూడా త్వరలోనే క్రాష్ అవుతుందని అన్నాడు.

Also Read : Rythu Bandhu: రైతు బంధు పంపిణీకి అనుమతివ్వండి: ఈసీకి బీఆర్ఎస్ విజ్ఞప్తి

టీఎంసీ ఎంపీపై బీజేపీ మండిపడింది. టీఎంసీ ఎంపీ శాంతాను సేన్ అన్ని హద్దులు దాటాడని, జాతీయ రాజకీయాల్లో అధోపాతానికి వెళ్లాడని బీజేపీ జాతీయ స్పోక్స్‌పర్సన్ షెహజాద్ పూనావాలా ఫైర్ అయ్యాడు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీని వెంటనే టీఎంసీ పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశాడు. తేజస్ జెట్ కూలిపోవాలని ఆయన కోరుకుంటున్నాడని, దాని ద్వారా ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన పైలట్ మరణిస్తాడని అన్నాడు. ఆయన వ్యాఖ్యలు దేశ వ్యతిరేక శక్తుల మాటల్లాగే ఉన్నాయని పేర్కొన్నాడు. టీఎంసీకి ఏమాత్రం ఇంటిగ్రిటీ ఉన్నా వెంటనే ఎంపీ శాంతాను సేన్‌ను పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశాడు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios