బుధవారం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పదో తరగతి ఫలితాలను విడుదల చేసింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ట్విట్టర్ ద్వారా స్పందించారు.

‘‘ సీబీఎస్ఈ-X, XII ఫలితాలతో సంతోషంగా లేని వారికి, తాను ఒకటి చెప్పదలచుకుంటున్నాను.. ఒక్క పరీక్ష ద్వారా మీలో సత్తాను అంచనా వేసుకోవద్దు. మీలో ప్రతి ఒక్కరూ అనేక సామర్ధ్యాలతో పుట్టారు. జీవితాన్ని పరిపూర్ణంగా జీవించాలి. ఎప్పుడూ ఆశను కోల్పోవద్దని, అద్భుతాలు చేస్తారని ప్రధాని ట్వీట్ చేశారు.

ఫిబ్రవరి నెలలో 2019- 20 విద్యా సంవత్సరానికి గాను నిర్వహించిన పరీక్షల్లో 91.6 శాతం విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు. 2019 ఫలితాలకంటే 0.36 శాతం మంది అధికంగా విద్యార్ధులు ఉత్తీర్ణులు అయ్యారని బోర్డు వెల్లడించింది.

నేడు విడుదల చేసిన ఫలితాలలో తిరువనంతపురం, చెన్నై, బెంగళూరు జోన్స్ తొలి మూడు స్థానాల్లో నిలిచాయని బోర్డు తెలిపింది. ఈ ఏడాది మొత్తం 18 లక్షల మంది పరీక్షలకు హాజరయ్యారని, ఇందులో ఒకటి లేదా రెండు సబ్జెక్ట్‌లలో ఫెయిల్ అయిన విద్యార్ధులకు సప్లిమెంటరీ పరీక్షలు త్వరలో నిర్వహిస్తామని బోర్డ్ తెలియజేసింది. ఇందుకు సంబంధించి షెడ్యూల్‌ను త్వరలో తెలపనుంది.