మోడీ సభకు పోటెత్తిన జనం , వారిలో 95 ఏళ్ల బీజేపీ కార్యకర్త .. అంతమందిలోనూ గుర్తించి పలకరించిన ప్రధాని
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా డియోగర్‌లో గురువారం జరిగిన ర్యాలీ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. 95 ఏళ్ల బిజెపి నేత ధరమ్ చంద్ దేరాసరియా జీని పలకరించారు.
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా డియోగర్‌లో గురువారం జరిగిన ర్యాలీ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. 95 ఏళ్ల బిజెపి నేత ధరమ్ చంద్ దేరాసరియా జీని పలకరించారు. దశాబ్దాలుగా పార్టీలో పనిచేస్తున్న ధరమ్ చంద్ సాధారణ ప్రేక్షకులతో పాటు కూర్చున్నారు. ఒక సీనియర్ కార్యకర్తను గుర్తించిన ప్రధాని తీరుపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.
అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. రాజస్థాన్‌లో గత ఐదేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వ రికార్డును బట్టి చూస్తే రాష్ట్రంలో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కష్టమేనన్నారు. గడిచిన ఐదేళ్లలో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఎలాంటి పాలన అందించిందో ప్రజలకు తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి మహిళా వ్యతిరేక ప్రభుత్వాన్ని రాజస్థాన్ ఎన్నడూ చూడలేదని.. అల్లర్లు, కర్ఫ్యూలు, నేరాల్లో రాజస్థాన్ నెంబర్‌వన్ అని.. అవినీతి, పేపర్ లీకేజ్‌ల విషయంలోనూ రాష్ట్ర అగ్రస్థానానికి చేరుకుందని మోడీ చురకలంటించారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే పర్యాటకం, యాత్రలు, పెట్టుబడులు, విద్య, క్రీడలు, పరిశ్రమల రంగాల్లో రాష్ట్రాన్ని ముందుండి నడిపిస్తామని మోడీ చెప్పారు.
రాజస్థాన్‌లోని గుర్జర్ కాంగ్రెస్ మాదిరిగా ఎవరూ అవమానించలేదని, రాజేష్ పైలట్ కుమారుడిని ఉద్దేశించి దేశద్రోహి వంటి పదాలు వాడారని ప్రధాని ఎద్దేవా చేశారు. గుర్జర్ సామాజిక వర్గానికి చెందిన బిడ్డ రాజకీయాల్లో తన స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు కష్టపడుతున్నాడని సచిన్ పైలట్‌ని ఉద్దేశించి మోడీ పేర్కొన్నారు. తన జీవితం మొత్తం త్యాగం చేసి పార్టీని అధికారంలోకి తీసుకొస్తే..రాజ కుటుంబం అతనిని అత్యున్నత పదవికి దూరం చేసిందని మోడీ చురకలంటించారు.