పోప్ ఫ్రాన్సిస్‌తో ప్రధాని మోడీ భేటీ.. భారత్‌కు ఆహ్వానం
భారత ప్రధాని నరేంద్ర మోడీ వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్‌తో సమావేశమయ్యారు. సుమారు గంటపాటు వారు ముఖాముఖిగా అంతర్జాతీయ సమస్యలపై చర్చించారు. పర్యావరణ మార్పులు, పేదరికం, ఇతర అంశాలపై వారు మాట్లాడుకున్నారు. పోప్ ఫ్రాన్సిస్ ప్రైవేటు లైబ్రరీలో వారు భేటీ అయినట్టు తెలిసింది. ప్రధాని మోడీ వెంట జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఉన్నారు.

pm modi pope francis
న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు(శనివారం) కాథలిక్ క్రైస్తవుల మత నాయకుడు పోప్ ఫ్రాన్సిస్‌తో సమావేశమయ్యారు. వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ ప్రైవేటు లైబ్రరీలో ముఖాముఖిగా భేటీ అయ్యారు. షెడ్యూల్ ప్రకారం 20 నిమిషాలు సమావేశం కావాల్సి ఉంది. కానీ, గంట వరకు వీరిరువురు చర్చలు జరిపారు. ఈ సమావేశం హృదయపూర్వకంగా జరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. అనేక అంశాలపై పోప్ ఫ్రాన్సిస్‌తో మాట్లాడే అవకాశం దక్కిందని వివరించారు. భారత పర్యటనకు రావాల్సిందిగా పోప్ ఫ్రాన్సిస్‌ను ఆహ్వానించినట్టు ప్రధాని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెంట జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్‌లు ఉన్నారు.
ఈ సమావేశంలో పర్యావరణ మార్పులకు అడ్డుకట్ట వేయడం, పేదరికాన్ని నిర్మూలించడం వంటి అంతర్జాతీయ సమస్యలపై చర్చించారు. అనంతరం భారత్‌కు రావాల్సిందిగా పోప్ ఫ్రాన్సిస్‌ను ప్రధాని మోడీ కోరారు. చివరిసారిగా 1999లో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న కాలంలో పోప్ జాన్ పాల్ II భారత్ పర్యటించారు. మళ్లీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ కొనసాగుతున్న కాలంలో పోప్‌ను భారత్‌కు ఆహ్వానించడం గమనార్హం.
pm modi pope francis
ఇటలీ ప్రధాని మేరియో డ్రాగి ఆహ్వానం మేరకు జీ20 సదస్సులో పాల్గొనడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రోమ్‌లో రెండు రోజుల పర్యటనలో ఉన్నారు.
రోమ్‌లో ప్రతినిధుల సమావేశానికి ముందే ప్రధాని మోడీ పోప్ ఫ్రాన్సిస్‌లు సమావేశమయ్యారు. అనంతరం, ప్రధాని మోడీ యూకేలోని గ్లాస్గోకు చేరనున్నారు. యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ ఆహ్వానం మేరకు ఆయన సీవోపీ 26 సమావేశంలో పాల్గొననున్నారు.
ఇటలీ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం పలు సంస్థల ప్రతినిధులతోపాటు భారత ప్రవాసీలనూ కలిశారు. రోమ్‌లో మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు.
pm modi pope francis
పోప్ ఫ్రాన్సిస్‌తో సమావేశంపై విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్దన్ శ్రింగ్లా నిన్న మాట్లాడారు. పోప్ ఫ్రాన్సిస్‌తో మాట్లాడటానికి ప్రత్యేక అజెండా ఉండాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి ప్రముఖులతో మాట్లాడుతున్నప్పుడు ప్రత్యేక అజెండా ఉండకపోవడమే సంప్రదాయమని వివరించారు. ఆ ఆనవాయితీని గౌరవిస్తామని తెలిపారు. అంతర్జాతీయ అంశాలపై ఇరువురూ మాట్లాడతారని భావిస్తున్నట్టు వివరించారు.
pm modi pope francis
శనివారం ముగ్గురు దేశాధినేతలతో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం కానున్నారు. ఇందులో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ కూడా ఉన్నారు. ఆకాస్ కూటమితో చెలరేగిన ఆందోళనల నేపథ్యంలో ప్రధాని మోడీ ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో సమావేశం కాబోతున్నారు. ఫ్రాన్స్ నుంచి కొనుగోలు ఒప్పందాన్ని జలాంతర్గామిని ఆస్ట్రేలియా అర్థంతరంగా నిలిపేసింది. అమెరికా అణుజలాంతర్గామిని ఆఫర్ చేయడమే ఇందుకు ప్రధాన కారణంగా ఉన్నది. దీనిపై అమెరికాపై ఫ్రాన్స్ మండిపడుతున్నది. చైనాను కౌంటర్ చేయడానికే అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. ఇందులో భాగంగానే అమెరికా ఆకస్ కూటమిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టు భావిస్తున్నారు. ఇందులో భారత్‌కు చోటులేకపోవడం గమనార్హం.