Asianet News TeluguAsianet News Telugu

దేశంలో కోవిడ్ ఉద్ధృతి... దివ్యాంగులు, గర్బిణులకు వర్క్ ఫ్రమ్: ప్రధాని మోడీ కీలక నిర్ణయాలు

దేశంలో కొవిడ్‌ పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక భేటీ (narendra modi) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు ప్రధాని. దివ్యాంగులు, గర్బిణులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపారు. కంటైన్‌మెంట్ జోన్‌లలోని ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ సౌలభ్యం ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. 

PM narendra Modi key decisions amid covid outbreak
Author
New Delhi, First Published Jan 9, 2022, 7:25 PM IST

దేశంలో కొవిడ్‌ పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక భేటీ (narendra modi) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు ప్రధాని. దివ్యాంగులు, గర్బిణులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపారు. కంటైన్‌మెంట్ జోన్‌లలోని ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ సౌలభ్యం ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. ఉద్యోగులు వుంటున్న ప్రాంతాన్ని కంటైన్‌మెంట్ జోన్ నుంచి తొలగించిన తర్వాతే ఆఫీసుకు రావాలని ప్రధాని సూచించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా సమీక్షలో చర్చించారు. 

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరుగుతోన్న ఈ భేటీలో ఆరోగ్యశాఖతో పాటు కరోనా వర్కింగ్‌ గ్రూప్‌ నిపుణులు, ఇతర మంత్రిత్వశాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. థర్డ్‌వేవ్‌ ప్రభావంతో దేశవ్యాప్తంగా పెరుగుతోన్న కేసులు, వైరస్‌ కట్టడి చర్యలు, వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడం, మెడికల్‌ ఆక్సిజన్‌, ఔషధాల నిల్వ, వైరస్‌ ఉద్ధృతిని ఎదుర్కొనేందుకు వివిధ శాఖల సంసిద్ధత వంటి అంశాలపై ప్రధాని చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా మోదీ సమీక్ష జరిపినట్లు తెలుస్తోంది. దీనికి ముందు డిసెంబర్‌ 24న కొవిడ్‌పై ప్రధాని సమీక్ష నిర్వహించారు.  

కాగా.. శ‌నివారం ఒక్క‌రోజే దేశంలో ల‌క్ష‌న్న‌ర మందికి పైగా వైర‌స్ బారిన‌ప‌డ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా 1,59,377 మందికి Coronavirus సోకింది. రోజువారీ కేసులు లక్ష దాటిన రెండు రోజుల్లోనే 1.5 లక్షలకు చేరుకోవడంపై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. Covid-19 సేకండ్ వేవ్  స‌మ‌యంలో 2021 మే 30న చివరిసారిగా లక్షన్నర కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మళ్లీ అదే స్థాయిలోనే శనివారం రోజువారీ కేసులు నమోదుకావడం ఇదే మొదటిసారి. దీంతో దేశంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,55,28,004 పెరిగింది. 

అలాగే, గ‌త 24 గంట‌ల్లో క‌రోనా మ‌హ‌మ్మారితో పోరాడుతూ.. 329 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 4,83,790 కి పెరిగింది. రోజువారీ కేసులు భారీగా పెరుగుతుండటంతో యాక్టివ్ కేసులు అదేస్థాయిలో పెరుగుతూ వస్తున్నాయి. డిసెంబరు 31 నాటికి లక్ష ఉన్న Coronavirus యాక్టివ్ కేసులు.. ప్రస్తుతం ఆరు లక్షలకు చేరువ‌య్యాయి. ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా వైర‌స్ యాక్టివ్ కేసులు 5,90,611గా ఉన్నాయి. ఇదే స‌మ‌యంలో 40,863 మంది క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్నారు. 

దీంతో మొత్తంగా క‌రోనా వైర‌స్ నుంచి బ‌య‌ట‌ప‌డిన వారి సంఖ్య 3,44,53,603కు పెరిగింది. క‌రోనా రిక‌వ‌రీ రేటు 97.3 శాతంగా ఉంది. మ‌ర‌ణాల రేటు 1.37 శాతంగా ఉంది. Covid-19 పాజిటివిటీ రేటు 5.3 శాతంగా ఉంది. క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల‌ను వేగ‌వంతం చేస్తున్నాయి. దీనిలో భాగంగా క‌రోనా ప‌రీక్ష‌లు, వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌లో వేగం పెంచాయి. ఇప్పటివ‌ర‌కు దేశంలో 68,84,70,959 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన‌ట్టు భార‌తీయ వైద్య ప‌రిశోధ‌న మండ‌లి (ఐసీఎంఆర్‌) వెల్ల‌డించింది. శ‌నివారం ఒక్క‌రోజే 15,29,948 Coronavirus శాంపిళ్ల‌ను ప‌రీక్షించిన‌ట్టు తెలిపింది. 

ఇదిలావుండ‌గా, క‌రోనా రోజువారీ కేసుల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో కొనసాగుతోంది. అక్కడ కొత్తగా 41,434 కేసులు వెలుగుచూశాయి. ఇదే స‌మ‌యంలోCovid-19 కార‌ణంగా 13 మంది చనిపోయారు. మ‌హారాష్ట్రలో న‌మోద‌వుతున్న మొత్తం కేసుల్లో అత్య‌ధికం దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యిలోనే న‌మోదుకావ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. నిన్న ఒక్క ముంబయిలోనే 20,318 కేసులు నమోదయ్యాయి. ప్ర‌స్తుతం మ‌హారాష్ట్రలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,41,492కు పెరిగాయి. దేశ రాజ‌ధాని ఢిల్లీలోనూ క‌రోనా ప్ర‌భావం పెరుగుతోంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios