దేశంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ .. ‘‘యశోభూమి’’ని ప్రారంభించిన ప్రధాని మోడీ
దేశంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ప్రారంభించారు. దీనిని ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (ఐఐసీసీ)గా పిలుస్తున్నారు. అలాగే ‘‘యశోభూమి’’గా నామకరణం చేశారు.

దేశంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ప్రారంభించారు. దేశ రాజధాని ఢిల్లీలో రూ.5,400 కోట్లతో దీనిని నిర్మించారు. దీనిని ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (ఐఐసీసీ)గా పిలుస్తున్నారు. అలాగే ‘‘యశోభూమి’’గా నామకరణం చేశారు. దీనితో పాటు యశోభూమి వరకు చేరుకునేందుకు వీలుగా ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ మెట్రో రైలు ఎక్స్‌టెన్షన్‌ను ప్రారంభించారు. అనంతరం మెట్రోలో ద్వారక స్టేషన్‌కు చేరుకున్నారు. 73,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని నిర్మించారు. ఆడిటోరియంతో పాటు 15 కన్వెన్షన్ రూమ్‌లు ఇక్కడ వున్నాయి. గ్రాండ్ బాల్ రూమ్, 13 సమావేశ మందిరాలు ఏర్పాటు చేశారు.
ప్రధాని ఆడిటోరియంలో 6 వేల మంది కూర్చోవచ్చని అధికారులు తెలిపారు. అలాగే గ్రాండ్ బాల్‌రూమ్‌లో 2500 మంది కూర్చోవచ్చు. దేశంలోనే అతిపెద్ద ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. అవసరమనుకుంటే ఇక్కడ సీటింగ్ కెపాసిటీని పెంచుకోవచ్చు. యశోభూమి నుంచి ద్వారకాలోని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ లైనుకు చేరుకోవచ్చు.