Deenanath Mangeshkar Award: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. దేశానికి, సమాజానికి నిస్వార్థంగా సేవలు అందిస్తున్నందుకు ప్రధాని మోదీ..లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డును అందుకున్నారు. లతా మంగేష్కర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు 

Deenanath Mangeshkar Award: భారత ప్రధాని నరేంద్ర మోడీకి మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రధాని మోడీ .. దేశానికి, సమాజానికి చేస్తున్న‌ నిస్వార్థ సేవలకు గుర్తుగా.. లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు (Lata Deenanath Mangeshkar Award)ను అందించారు. భార‌తీయ లెజెండరీ సింగర్​ లతా మంగేష్కర్​ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన అవార్డే.. లతా దీనానాథ్​ మంగేష్కర్​ అవార్డు.

జరిగిన తొలి లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)ముంబైకి వచ్చారు. . ఈ సందర్భంగా ఇంతటి ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకోవడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం ముంబైలో జరిగిన తొలి లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ముంబైలోని షణ్ముకానంద హాల్​ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మోడీని తొలి లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డుతో సత్కరించారు. 

ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. లతా మంగేష్కర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. త‌న‌కు లతా దీదీ.. పెద్దక్క వంటిందనీ, ఆమె సరస్వతీ దేవికి ప్రతిరూపం. సంగీతం దేశభక్తిని ప్రబోధిస్తుందనీ, లతా మంగేష్కర్ స్వరంలో దేశభక్తి పరవళ్లు తొక్కేదని ప్రధాని అన్నారు. త‌నకు సంగీతం మీద లోతైన అవగాహన లేదని, అయితే సాంస్కృతిక అవగాహనతో సంగీతాన్ని సాధనతో పాటు అనుభూతిగా భావిస్తున్నానని అన్నారు. 

లతా జీ 'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్'కు మధురమైన స్వరం లాంటిదని ప్రధాని అన్నారు. లతా దీదీ లాంటి అక్క పేరు మీద అవార్డు వచ్చినప్పుడు, అది ఆమెలోని ఏకత్వానికి, నాపై ఉన్న ప్రేమకు ప్రతీక. అందుకే అంగీకరించక పోవడం నాకు సాధ్యం కాదు అని అన్నారు. ఈ అవార్డును ప్రధాని మోదీ తన దేశ ప్రజలందరికీ అంకితం చేశారు. దేశానికి, ప్రజలకు, సమాజానికి మార్గనిర్దేశం చేస్తూ విశేష కృషి చేసే వ్యక్తికి ఈ అవార్డును ప్రతిఏటా అందజేస్తామని లతా మంగేష్కర్‌ కుటుంబం,మాస్టర్​ దీనానాథ్​ మంగేష్కర్​ స్మృతి ప్రతిష్ఠాన్​ ఛారిటబుల్​ ట్రస్ట్ తెలిపింది. ఈ కార్యక్రమంలో ఉషా మంగేష్కర్, ఆశాభోంస్లే, మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారి, మహారాష్ట్ర బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ల‌తా మంగేష్కర్ భార‌త దేశ లెజండ‌రీ సింగర్.. దాదాపు 30 భాష‌లల్లో వేలాది పాటలు పాడాడు. హిందీ, మరాఠీ, సంస్కృతంతో పాటు.. ఇతర భారతీయ భాషల్లో ఆమె పాటలు పాడింది. ప్రతి భాషలోనూ లతాజీ స్వరం ఒకేలా ఉంటుంది. ఆమె భారత సాంస్కృతిక రాయబారి.