ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పార్లమెంట్‌లో అందుబాటులో ఉన్న పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పార్లమెంట్‌లో అందుబాటులో ఉన్న పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. ప్రధాని మోదీతో భేటీలో పాల్గొన్నవారిలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరన్ రిజిజు, కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఉన్నారు.
దాదాపు నెల రోజుల విరామం తర్వాత సోమవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ రెండో విడత సమావేశాలు ప్రారంభమైన. అయితే ఓవైపు విపక్ష నేతల నిరసలు, మరోవైపు భారత్‌లో ప్రజాస్వామ్యం దాడికి గురవుతోందంటూ లండన్ పర్యటనలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని అధికార పక్షం పట్టుబడుతున్న నేపథ్యంలో.. గత మూడు రోజులుగా ఉభయసభలలో గందరగోళ పరిస్థితులు చోటుచేసుకున్నాయి. దీంతో ఉభయసభల కార్యకలాపాలకు అంతరాయం కలుగుతుంది. ఈ నేపథ్యంలో కేబినెట్ ప్రధాని మోదీ అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
