ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటక పర్యటనలో భద్రతా లోపం తలెత్తింది. ఆయన ప్రయాణిస్తున్న వాయుసేన హెలికాఫ్టర్ హెలిప్యాడ్ వద్ద బురదలో కూరుకుపోయింది.

ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటక పర్యటనలో భద్రతా లోపం తలెత్తింది. ఆయన ప్రయాణిస్తున్న వాయుసేన హెలికాఫ్టర్ హెలిప్యాడ్ వద్ద బురదలో కూరుకుపోయింది. ల్యాండ్ అయిన సమయంలోనే బురదలో కూరుకుపోవడంతో ఎస్పీజీ అధికారులు.. రాష్ట్ర ప్రభుత్వంపై సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. ప్రధాని హెలికాఫ్టర్ ల్యాండ్ అయ్యే ప్రదేశాన్ని ఎందుకు తనిఖీ చేయలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అధికారులు, సిబ్బంది హెలికాఫ్టర్‌ను బురదలోంచి బయటకు తీసేందుకు నానా తంటాలు పడ్డారు. క్రేన్లు తీసుకొచ్చి హెలికాఫ్టర్‌ను పైకి లేపినట్లుగా సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.