Asianet News TeluguAsianet News Telugu

సిక్కుల కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో ఎంతో చేశారు - ఖలిస్థాన్ అనుకూల మాజీ నేత జస్వంత్ సింగ్ థేకేదార్

ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోని సిక్కుల కోసం, సిక్కు సమాజం కోసం ఎన్నో మంచి పనులు చేశారని దాల్ ఖల్సా వ్యవస్థాపకుడు, ఖలిస్థాన్ అనుకూల మాజీ నేత జస్వంత్ సింగ్ థేకేదార్ అన్నారు. తమ డిమాండ్లను నెరవేర్చడానికి ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పనిచేసిందని కొనియాడారు. 

PM Narendra Modi has done a lot for Sikhs - Former pro-Khalistan leader Jaswant Singh Thekedar
Author
First Published Mar 17, 2023, 11:33 AM IST

భారతదేశంలో సిక్కు సమాజం కోసం ప్రధాని నరేంద్ర మోడీ చేసిన కృషిని దాల్ ఖల్సా వ్యవస్థాపకుడు, ఖలిస్థాన్ అనుకూల మాజీ నేత జస్వంత్ సింగ్ థేకేదార్ ప్రశంసించారు. వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’కు ప్రత్యేకంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ప్రధానిని కొనిడియారు. ‘‘మన ప్రధాని నరేంద్ర మోడీ సిక్కుల కోసం ఎంతో చేశారు. ఆయన మా కమ్యూనిటీని ప్రేమిస్తారు. బ్లాక్ లిస్టులను రద్దు చేయడం, కర్తార్ పూర్ కారిడార్ ను తెరవడం, చోటే సాహిబ్జాదాస్ (గురు గోవింద్ సింగ్ కుమారులు) గురించి మాట్లాడటం వంటివి ఆయన చాలా చేశారు.’’ అని తెలిపారు.

సిక్కు కమ్యూనిటీ సభ్యులు ముందు ఉంచిన ప్రధాన డిమాండ్లను నెరవేర్చడానికి ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పనిచేసిందని ఆయన అన్నారు. ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం కసరత్తు చేసిందని, కొన్ని డిమాండ్లు మాత్రమే నెరవేరాల్సి ఉందన్నారు. ఈ డిమాండ్లను తీర్చడానికి వారు అంగీకరిస్తే అంతా బాగుంటుందన్నారు.

బంగాళదుంపల కోల్డ్ స్టోరేజీ పైకప్పు కూలి 8 మంది మృతి, 11మంది రెస్క్యూ.. శిథిలాల కింద మరికొంత మంది...

అంతకు ముందు ప్రధాని మోడీ తన అధికారిక నివాసం 7 లోక్ కల్యాణ్ మార్గ్ లో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సిక్కులతో సమావేశమయ్యారు. సిక్కు కమ్యూనిటీ సంక్షేమం కోసం చర్యలు తీసుకున్నందుకు, ముఖ్యంగా ప్రతీ సంవత్సరం డిసెంబర్ 26ను వీర్ బాల్ దివస్ గా ప్రకటించాలని నిర్ణయించడం ద్వారా ఛార్ సాహిబ్జాదేను గౌరవించినందుకు ప్రతినిధి బృందం ప్రధాన మంత్రికి కృతజ్ఞతలు తెలిపింది. 
ప్రతినిధి బృందంలోని ప్రతీ సభ్యుడు ప్రధానిని 'సిరోపావో', 'సిరి సాహిబ్'లతో సత్కరించారు.

ఛార్ సాహిబ్జాదే సహకారం, త్యాగం గురించి దేశంలోని అనేక ప్రాంతాల ప్రజలకు తెలియదని ప్రధాని మోడీ అన్నారు. పాఠశాలల్లో, పిల్లల ముందు మాట్లాడే అవకాశం దొరికినప్పుడల్లా ఛార్ సాహిబ్జాదే గురించే మాట్లాడేవాడినని గుర్తు చేసుకున్నారు. డిసెంబర్ 26ను వీర్ బాల్ దివస్ గా పాటించాలన్న నిర్ణయం దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉన్న పిల్లలకు వాటి గురించి అవగాహన కల్పించడానికి ఎంతగానో దోహదపడుతుందని ప్రధాని మోదీ అన్నారు. 

గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పై క్రేజ్..ఇంటి నుంచి పారిపోయి జైలుకు చేరుకున్న బాలికలు..సెల్పీలు దిగుతుండగా..

తనను కలవడానికి వచ్చిన సిక్కు కమ్యూనిటీ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వారి కోసం తన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని చెప్పారు. వారితో తనకున్న అనుబంధాన్ని, పంజాబ్ లో ఉన్న సమయంలో కలిసి గడిపిన సమయాన్ని గుర్తు చేసుకున్నారు. సిక్కు కమ్యూనిటీ సేవా స్ఫూర్తిని ఆయన ప్రశంసించారు, దీని గురించి ప్రపంచానికి మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. సిక్కు కమ్యూనిటీ సంక్షేమానికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తీసుకున్న పలు చర్యలను వివరించారు.

సిక్కు యాత్రికుల కోసం కర్తార్పూర్ సాహిబ్ కారిడార్ను తెరవడానికి దౌత్య మార్గాల ద్వారా ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి మాట్లాడుతూ.. ఆఫ్ఘనిస్తాన్ నుండి గురు గ్రంథ్ సాహిబ్ ను పూర్తి గౌరవంతో తిరిగి తీసుకురావడానికి చేసిన ప్రత్యేక ఏర్పాట్లను వారికి వివరించాడు. 

జోధా అక్బర్ నటుడు అమన్ ధలివాల్ పై అమెరికాలో కత్తితో దాడి.. నీళ్లు కావాలంటూ వీరంగం...

కాగా.. గత ఏడాది ఫిబ్రవరిలో కూడా ప్రధాని మోడీ తన 7 లోక్ కల్యాణ్ మార్గ్ నివాసంలో ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన సిక్కు-హిందూ ప్రతినిధుల బృందం సభ్యులతో సమావేశమయ్యారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ద్వారా ఆఫ్ఘనిస్తాన్ నుంచి సిక్కులు, హిందువులను సురక్షితంగా భారత్ కు తీసుకువచ్చినందుకు వారు ఆయనను సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. వారు అతిథులు కాదని, తమ సొంత ఇంట్లోనే ఉన్నారని, భారత్ వారి ఇల్లు అని ప్రధాని మోడీ ప్రతినిధి బృందానికి స్వాగతం పలికారు. ఆఫ్ఘనిస్తాన్ లో వారు ఎదుర్కొంటున్న అపారమైన ఇబ్బందులను, వారిని సురక్షితంగా భారత్ కు తీసుకురావడానికి ప్రభుత్వం అందించిన సహాయం గురించి ఆయన మాట్లాడారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios