అయోధ్య రామ మందిరంలో ప్రతిష్టించనున్న బాల రాముడి విగ్రహ ముఖం రివీల్ చేశారు. ఐదేళ్ల బాలుడి రూపంలో నిలబడి ఉన్న రాముడి ముఖం ఇది వరకు బయటి ప్రపంచానికి చూపించలేదు. 

Ayodhya Ram Idol Face: అయోధ్యలో రామ మందిరంలో గురువారం మంత్ర ఉచ్ఛరణల నడుమ బాల రాముడి విగ్రహాన్ని గర్భగుడిలోకి చేర్చారు. ఇప్పటి వరకు ఆయన ముఖాన్ని బయటి ప్రపంచానికి చూపించలేదు. తాజాగా, ఆ రాముడి విగ్రహం ముఖాన్ని రివీల్ చేశారు. బాలరాముడి విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకెళ్లడానికి ముందు వర్క్ షాప్‌లో ఉన్నప్పుడు తీసిన ఫొటో ఇది. అయోధ్య రామాలయంలో బాల రాముడి ముఖం ఇలా ఉన్నది.

Scroll to load tweet…

ఐదేళ్ల బాలుడి రూపంలో నిలబడి ఉన్న స్థితిలో ఈ విగ్రహాన్ని చెక్కారు. 51 అంగుళాల ఎత్తు ఉన్న ఈ విగ్రహాన్ని మైసూరుకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కారు. కృష్ణ వర్ణపు శిలతో అరుణ్ యోగి రాజ్ ఈ విగ్రహాన్ని చెక్కారు.

Also Read: Ayodhya: అయోధ్య తీర్పు వెలువరించిన సుప్రీం న్యాయమూర్తులకు ప్రాణ ప్రతిష్టకు ఆహ్వానం

Scroll to load tweet…

ఈ బాల రాముడి చేతిలో బంగారి విల్లు, బాణం ఉన్నాయి. రాముడి బంగారు వర్ణం అస్త్రాలను చేత పట్టుకుని నిలబడిన స్థితిలో ఈ విగ్రహాన్ని అరుణ్ యోగి రాజ్ చెక్కారు.