New Delhi: సురినామ్ లో అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారం ‘గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ది చైన్ ఆఫ్ ది ఎలో స్టార్’ ను అందుకొన్నందుకు గానూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా రాష్ట్రప‌తికి అందించిన పుర‌స్కారం గురించి ప్ర‌స్తావించారు.  

Murmu receiving Suriname's highest civilian award: సురినామ్ లో అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారం ‘గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ది చైన్ ఆఫ్ ది ఎలో స్టార్’ ను అందుకొన్నందుకు గానూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా రాష్ట్రప‌తికి అందించిన పుర‌స్కారం గురించి ప్ర‌స్తావించారు. ప్ర‌ధాని మోడీ త‌న ట్వీట్ లో ‘‘సురినామ్ లో అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారం ‘గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ది చైన్ ఆఫ్ ది ఎలో స్టార్’ ను అందుకొన్నందుకు గానూ రాష్ట్రపతి ద్రౌప‌ది ముర్ముకు ఇవే మా అభినందనలు. సురినామ్ ప్రభుత్వం- ప్రజల తరఫున ఈ ప్రత్యేకమైనటువంటి కార్యం మన దేశాల మధ్య చిరకాలంగా ఉన్న మైత్రికి గుర్తు గా నిలుస్తోంది’’ అని పేర్కొన్నారు.

Scroll to load tweet…

అంత‌కుముందు రాష్ట్రప‌తి ముర్ము ట్విట్ట‌ర్ వేదిక‌గా సురినామ్ పుర‌స్కారం అందుకున్న విష‌యాన్ని వెల్ల‌డించారు. దీనిని అందుకోవ‌డం ఎంతో గౌర‌వంగా ఉంద‌ని తెలిపారు. ట్విట్ట‌ర్ లో "సురినామ్ అత్యున్నత పురస్కారం "గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ది చైన్ ఆఫ్ ది ఎల్లో స్టార్" అందుకోవడం నాకు చాలా గౌరవంగా ఉంది. ఈ గుర్తింపు నాకు మాత్రమే కాదు, నేను ప్రాతినిధ్యం వహిస్తున్న 1.4 బిలియన్ల భారతదేశ ప్రజలకు కూడా చాలా ముఖ్యమైనది. ఇరు దేశాల మధ్య సోదర సంబంధాలను సుసంపన్నం చేయడంలో కీలక పాత్ర పోషించిన భారత-సురినామీ కమ్యూనిటీలోని తరువాతి తరాలకు కూడా ఈ గౌరవాన్ని అంకితం చేస్తున్నాను" అని పేర్కొన్నారు.

Scroll to load tweet…